Advertisement
సినిమా ఇండస్ట్రీలో ఉండేవాళ్ళకి ఏ లోటు ఉండదేమో అని అనుకుంటారు. నటీనటులందరికీ ఎక్కువ డబ్బులు వస్తాయి లగ్జరీ లైఫ్ ని గడుపుతూ ఉంటారని అంతా అనుకుంటారు. కానీ కొంతమంది నటుల జీవితాన్ని చూస్తే కచ్చితంగా కంట తడి పెట్టుకుంటారు. సీరియల్ నటి కవిత లక్ష్మి గురించి చెప్పక్కర్లేదు. సీనియర్ ఆర్టిస్ట్ ఈమె. మలయాళం లో ఎన్నో సీరియల్స్ చేసింది. శ్రీ దానం అనే సీరియల్ లో శాంత పాత్రలో కనపడ్డారు.
Advertisement
ఈమె పైకి చెప్పుకోడానికి స్టార్ కానీ కష్టాల్లో మాత్రం ఈమె సాధారణ మనిషే. తన భర్తతో విడాకులు అయిపోయాయి. దానితో పిల్లలు బాగోగుల్ని ఆమె చూసుకుంటున్నారు. కవిత లక్ష్మి కొడుకు బ్రిటన్ లో చదువుతున్నాడు. చదువు బాగుంటుందని అక్కడ పార్ట్ టైం చేస్తూ చదవచ్చని బ్రిటన్ కి పంపించింది. కొడుకుకి డబ్బులు సరిపోవటం లేదు అవసరమైన సాయాన్ని కవిత లక్ష్మీ చేస్తూ డబ్బులు పంపుతోంది.
Advertisement
నెలకు ఒకటిన్నర లక్షల రూపాయలు పంపాలి దాంతో ఆమె కేరళ తమిళనాడు మధ్య హైవేనా రోడ్ సైడ్ ఒక చిన్న ఫుడ్ కోర్ట్ ని మొదలుపెట్టింది. దోశలు ఆమ్లెట్స్ వంటివి అమ్ముతుంది గొడ్డు మాంసం కూరల్ని కూడా కస్టమర్లకి అందిస్తోంది. లక్ష్మి కొడుకు ఆకాష్ కృష్ణ యూకే కి ఏడాది క్రితం వెళ్ళాడు ఆమె చేతిలో కేవలం రెండే సీరియల్స్ ఉన్నాయి. వచ్చే డబ్బులు వాళ్ళ కుటుంబానికి సరిపోతున్నాయి. అందుకని కొడుకు కోసం ఇలా రాత్రిళ్ళు దోశలు వేస్తూ రోడ్డు మీద అమ్ముతోంది. ఆమె చేస్తున్న పని చూసి నెటిజెన్స్ హాట్సాఫ్ అంటున్నారు.
Also read: