Ads
YS Sharmila Love Story: తన అన్నతో విభేదించిన షర్మిల తానూ తెలంగాణ కోడలిని అని చెప్తూ.. తెలంగాణాలోనే పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. ఎన్ని విమర్శలు చేస్తున్నా.. ఎవరు ఎన్ని మాటలు అంటున్నా… ఆమె తన రాజకీయం తెలంగాణలోనే ఉంటుందని స్పష్టం చేసారు. రాయలసీమ బిడ్డ షర్మిలకు, తెలంగాణ వ్యక్తి అనిల్ కి పరిచయం ఎలా ఏర్పడిందో ఇప్పుడు చూద్దాం. షర్మిల తానూ చదువుకునే రోజుల్లో ఉన్నప్పుడే ఓ సారి ఓ ధాబాకు వెళ్లారట. అక్కడే మొదటి సారి అనిల్ ను చూశారట.

Interesting Love Story of YS Sharmila and Husband Anil
ఆ తరువాత వాళ్లిద్దరూ చాలా సార్లు కలుసుకుంటూ ఉన్నారట. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదు కానీ, చాలా రోజుల తరువాత అనిల్ కుమార్ తనకు ప్రపోజ్ చేసారని షర్మిల చెప్పుకొచ్చారు. అయితే.. ఈ విషయాన్నీ షర్మిల తన తండ్రి రాజశేఖర్ రెడ్డితో చెప్పారట. కానీ ఆయన ఒప్పుకోలేదట. వాళ్ళు బ్రాహ్మిన్స్ అనీ, వాళ్ళ పద్ధతులు మన పద్ధతులు వేరుగా ఉంటాయని చెప్పారట. నీకు ముక్క లేకపోతే ముద్ద దిగదనీ.. వాళ్లేమో ముక్క ముట్టుకోరు అని చెప్పుకొచ్చారు.
Advertisement

YS Sharmila
ఈ పెళ్లి వద్దు అంటూ తండ్రి రాజశేఖర్ రెడ్డి చాలా సార్లే చెప్పి చూశారట. కానీ ఈ విషయంలో మాత్రం షర్మిల ఎదురు తిరిగారట. అనిల్ నే పెళ్లి చేసుకోవాలని మొండిపట్టు పట్టానని.. అలా మా పెళ్లి జరిగిపోయిందని అన్నారు. అయితే.. అనిల్ కు పెళ్ళికి ముందు నుంచే నాన్ వెజ్ తినే అలవాటు ఉండడంతో పెళ్లి అయ్యాక మాకు ఎలాంటి ఇబ్బంది రాలేదన్నారు. ఇక అనిల్ కూడా ఒక మంచి తండ్రిగా, భర్త తన బాధ్యత తానూ తీసుకున్నారని మాకు ఇబ్బంది కలగలేదని షర్మిల చెప్పుకొచ్చారు.