Advertisement
ఈ మధ్యకాలంలో విడాకులు ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీలు విడాకులు తీసుకోవడం అనేది ఒక హాట్ టాపిక్ గా మారుతోంది. అయితే ఇప్పుడు సెలబ్రిటీల జాబితాలో చూసుకుంటే జయం రవి కూడా ప్రకటన చేయడం జరిగింది. సోషల్ మీడియాలో కొన్ని రోజుల నుండి జయం రవి తన భార్య ఆర్తి తో విడాకులు తీసుకున్నారని ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే అది ఇప్పుడు నిజం అయింది. జయం రవి విడాకులకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. ఆ పోస్టులో ఈ విధంగా వ్యక్తం చేశారు, లైఫ్ అనేది ఎన్నో అధ్యాయాలతో నిండిన ప్రయాణం అని ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాలని పేర్కొన్నారు.
Advertisement
ఈ రోజు మీ అందరితో ఒక వ్యక్తిగత విషయాన్ని పంచుకుంటున్నానని ఆయన అనడం జరిగింది. ఈ విషయాన్ని ఎంతో భారమైన హృదయంతో చెప్పాల్సి వస్తోంది అని అంటూ తెలిపారు, ఎన్నో ఆలోచనలు చర్చలు తర్వాత నేను నా భార్య ఆర్తి విడాకులు తీసుకోవాలని కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నామని తెలిపారు. వారిద్దరి మంచి కోసమే ఇలా చేశామని ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా మాతోపాటు మా కుటుంబ సభ్యుల ప్రైవసీని గౌరవించాలని కోరుకున్నారు.
Advertisement
Also read:
2019 లో జయం రవి ఆర్తి వివాహం జరిగింది, వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. పొన్నియన్ సెల్వన్ సినిమాలో మంచి పాత్రను పోషించడంతో విజయాన్ని సాధించారు. టాలీవుడ్ లో హిట్ అయిన జయం సినిమాను తమిళంలో రీమేక్ చేయడం ద్వారా మంచి పేరు వచ్చింది. దీంతో ఎన్నో మంచి ఆఫర్లను కూడా అందుకున్నారు. ప్రస్తుతం అయితే జయం రవి ఇప్పుడు తెలుగు తమిళ భాషల్లో సినిమాలు చేస్తున్నారు.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!