Advertisement
శ్రావణమాసం శుక్రవారం 29 జూలై 2022 నుండి ప్రారంభమైంది. శ్రావణ మాసానికి చాలా ప్రాముఖ్యత ఇవ్వబడింది. పరమశివునికి ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తులు శివున్ని ఆరాధించడం, రుద్రాభిషేకం చేయడం ద్వారా జీవితంలోని కష్టాలు తొలగిపోతాయని విశ్వాసం. అయితే అలాంటి శ్రావణమాసంలో కొన్ని పనులు చేయకూడదు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
Advertisement
మీరు ఎప్పటి నుండో రుద్రాక్షలను ధరించాలని అనుకుంటూ ఉంటే, శ్రావణమాసం రుద్రాక్షలను ధరించేందుకు అనువైన సమయం. ఎందుకంటే రుద్రాక్షను శివుని స్వరూపంగా భావిస్తారు. వీటిని ధరించడం ఎంతో పవిత్రంగా పరిగణించబడుతుంది. శ్రావణమాసంలో పాలు, పాలకు సంబంధించిన ఉత్పత్తులు, పెరుగు, నెయ్యి వంటి వాటిని దానం చేయాలి. ఇలా చేస్తే మీరు కోరుకున్న ఫలితాలు లభిస్తాయి.
Advertisement
అలాగే శ్రావణమాసానికి ముందే మీ ఇంటిని మొత్తం శుభ్రం చేసుకోండి. ఉతికిన బట్టలనే ధరించండి. శ్రావణమాసంలో పొరపాటున కూడా మాంసం జోలికి వెళ్లొద్దు. అలాగే మద్యం కూడా తీసుకోకూడదు. మీరు పొరపాటున వీటిని తీసుకుంటే శివుడు ఆగ్రహిస్తాడట. అలాగే ఈ నెలలో మీరు నూనెతో మీ బాడిని మసాజ్ వంటివి చేసుకోకూడదు. శ్రావణమాసంలో మధ్యాహ్నం వేల నిద్రపోవడాన్ని నిషేధించాలినిషేధించాలి. అలాగే గడ్డం మరియు జుట్టు కత్తిరించకూడదు. శ్రావణమాసంలో ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి పదార్థాలను తినడం మానేయాలి. అలాగే కాంస్య (రాగి) పాత్రలను కూడా ఈ నెలలో నిషేధించబడింది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే శివునికి తులసి ఆకులను అస్సలు సమర్పించకండి.
ALSO READ: కోట్ల రూపాయలు ఇస్తామంటున్నా ఆ పని చేయలేమంటున్న స్టార్ నటులు..!!