Advertisement
బార్బోడోస్ వేదికగా గురువారం వెస్టిండిస్ తో జరుగనున్న తొలివన్డేకు టీమ్ కి ఇండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ దూరం కానున్నాడు. సూపర్ ఫామ్ లో ఉన్నటువంటి సిరాజ్ కి విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ భావించిన నేపథ్యంలో అతను తిరిగి వచ్చేశాడు. వెస్టిండిస్ తో జరిగిన రెండో టెస్టులో ఐదు వికెట్లతో తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు మహహ్మద్ సిరాజ్. వర్క్ లోడ్ కారణంగా విండిస్ తో జరుగనున్న వన్డే సిరీస్ నుంచి సిరాజ్ ని బీసీసీఐ భావించిన నేపథ్యంలో అతను ఇండియాకి తిరిగి వచ్చేశాడు. వెస్టిండిస్ జరుగనున్న వన్డే సిరీస్ నుంచి సిరాజ్ ని బీసీసీఐ తప్పించింది.
Advertisement
Advertisement
మరోవైపు ఈ ఏడాది విండిస్ తో జరుగనున్న వన్డే సిరీస్ నుంచి సిరాజ్ ని బీసీసీఐ తప్పించడానికి కారణం ఈ ఏడాది ఆసియా కప్, వన్డే ప్రపంచ కప్ ఈవెంట్ లు ఉండటం వల్లనే విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ భావించింది. అశ్విన్, భరత్, అజింక్య రహానే, నవదీప్ సైని ఈ నలుగురినీ టెస్టులకు మాత్రమే ఎంపిక చేశారు. వాళ్లు స్వదేశానికి తిరిగి వచ్చారు. ఈ నేపథ్యంలోనే విండిస్ నుంచి తిరిగి వచ్చిన టెస్ట్ సభ్యులతో కలిసి సిరాజ్ కూడా ఇండియాకి వచ్చేశాడు. స్టార్ పేసర్ షమీ లేకపోవడంతో వన్డే సిరీస్ లో కూడా భారత పేస్ దళానికి సిరాజ్ నాయకత్వం వహిస్తాడని తెలుస్తోంది. ఇంత బిజీ షెడ్యూల్ లో సిరాజ్ కి విశ్రాంతి లభించదని భావించిన బీసీసీఐ విండిస్ వన్డే సిరీస్ నుంచి అతనికి విశ్రాంతి ఇచ్చింది. సిరాజ్ అభిమానులు బీసీసీఐ తీసుకున్న నిర్ణయం సరైనదే అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.