Advertisement
SLBC Irrigation Project: తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో మహమ్మారి ఫ్లోరైడ్ వల్ల ఎంతో మంది జీవితాలు చిన్నాభిన్నం అయ్యాయి.. ఇప్పటికీ ఈ ఫ్లోరైడ్ వల్ల సమస్యలు ఎదుర్కొంటున్న ఎంతోమంది పేద ప్రజలు ఉన్నారు.. వారి సమస్యలు తీర్చడం కోసమే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కంకణం కట్టుకొని, ఫ్లోరైడ్ ను తరిమేయాలని లక్షల ఎకరాలను పచ్చదనంగా తయారుచేయాలని, మంచి నీటిని అందించి ప్రజల గొంతులు తడపాలని భావించారు. కాంగ్రెస్ హయాంలోనే SLBC ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.. కానీ ఇంతలోనే తెలంగాణ ప్రత్యేక ఉద్యమం. అంతలోనే ప్రత్యేక రాష్ట్రం, తెరాస ప్రభుత్వం గద్దెనెక్కడం, ప్రాజెక్టు పనులలో అలసత్వం వహించడం జరిగింది. దీనిపై కోమటిరెడ్డి గర్జిస్తున్నారు, ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వంపై ఫైట్ చేస్తున్నారు.. మరి ఆయన కల నెరవేరిందా.. ప్రాజెక్టు పనులు ఎంత వరకు పూర్తయ్యాయి అనే విషయాలు చూద్దాం.. SLBC కంటే వెనుక వచ్చిన కాలేశ్వరం ప్రాజెక్టు పూర్తయింది. లక్ష కోట్లతో ప్రాజెక్టును పూర్తి చేసిన ప్రభుత్వం, ఎస్ ఎల్ బి సి పై కుట్ర పన్ని ఫ్లోరైడ్ కోరల్లో నలిగిన నల్లగొండ జిల్లాకు దక్కాల్సిన కృష్ణా నీటిని రూటు మార్చి మొండిచేయి చూపించారు.
Advertisement
SLBC Dream Project of MP Komati Reddy Venkat Reddy
లక్షల కోట్ల కాంట్రాక్టుల కోసం కక్కుర్తిపడి ప్రజల గొంతు తడిపె SLBC ని కావాలని పక్కన పెట్టేసారని కోమటిరెడ్డి ప్రతి సారి మీడియా ముఖంగా గర్జిస్తూనే ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే SLBC ప్రాజెక్టు అనేది కోమటిరెడ్డి కళ.. అలనాడు దేశంలోనే అతిపెద్ద సొరంగ మార్గమైన ఎస్ఎల్బీసీ టన్నెల్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు1925 కోట్లతో ఐదేళ్లలో పూర్తి చేయాలన్నది వీరి టార్గెట్. 2007 నుండి 2013 వరకు 850 కోట్లు ప్రాజెక్టు కోసం నిధులు మంజూరు అయ్యాయి. దీని వెనుక అడుగడుగున వెంకన్న కృషి ఉందని చెప్పవచ్చు. కెసిఆర్ అధికారంలోకి వచ్చాక, ఈ టన్నెల్ పనులు ఆగిపోయాయి.. మరి దురదృష్టం ఏంటంటే 44 కిలోమీటర్ల సొరంగ మార్గానికి 34 కిలోమీటర్లు తవ్వేశారు. ఇక మిగిలింది కేవలం పది కిలోమీటర్లు. అయినా సర్కారుకు దయ కలగలేదు..2019,2020SLBC కి కేటాయించిన టువంటి బడ్జెట్ 3 కోట్లు,2020-21లో కూడా మళ్లీ 3 కోట్లు కేటాయించారు..
Advertisement
ALSO READ:మన తెలుగు యాంకర్స్ తీసుకునే రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!!
ఈ విధంగా కేటాయించిన బడ్జెట్ నిర్వహణ వేయడానికి కూడా సరిపోదు.. ఇవి చూస్తే అర్థం చేసుకోవచ్చు నల్గొండ పై కెసిఆర్ కు ఎంత ప్రేమ ఉందో.. ఈ ప్రాజెక్టు పూర్తి చేసి పేద ప్రజలకు మీరు అందించాలన్నదే కోమటిరెడ్డి కల, దీంతో కేసీఆర్ పై పోరాటానికి దిగాడు. ప్రభుత్వానికి లేఖల మీద లేఖలు, నత్త నడక సాగించే సంస్థలను తీసి వేయాలంటూ ఫిర్యాదులు, SLBC కి కేవలం రెండు వేల కోట్లు ఇవ్వండి చాలు. నాలుగు వేల క్యూసెక్కుల నీరు నల్గొండ దప్పిక తీరుతుందని, గొంతు చీల్చుకొని మరి సర్కార్ ముందు తన గోసను వినిపించారు. అయినా కరగని తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే జీవో నెంబర్ 246 తో నల్గొండ ప్రజల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తోంది.. నల్గొండ జిల్లాకు దక్కాల్సిన 45 టీఎంసీల నీటిని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కేటాయించింది..
ఈ విధంగా రెండు జిల్లాల ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తోంది.. ఇలా పేద ప్రజలను మోసం చేస్తూ దుర్మార్గమైన జీవోను రద్దు చేయాలని కోమటిరెడ్డి దీక్షను చేపట్టారు.. పనికిరాని కాలేశ్వరం ప్రాజెక్టుకు లక్షల కోట్లు పెట్టి దోచుకుంటున్నారని వారి బండారాన్ని బయట పెట్టారు.. ప్రజల ప్రాణాలు నిలిపే రెండు వేల కోట్ల ప్రాజెక్టును ఆపారంటూ తెలంగాణ ప్రభుత్వంపై వ్యతిరేక బాణాలు విసిరాడు.. అయినా కరగని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ ఆ ప్రాజెక్టును అలాగే ఉంచింది.. మరి ఈ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో, నల్గొండ ప్రజల దాహార్తిని ఎప్పుడు తీరుతుందో ముందు ముందు తెలుస్తుంది. కానీ ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు నా పోరాటం ఆగదని కోమటిరెడ్డి భీష్మించుకు కూర్చున్నారు.
ALSO READ: