Advertisement
7/జి బృందావన్ కాలనీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నటి సోనియా అగర్వాల్. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో పాటు సోనియా అగర్వాల్ కు తెలుగునాట మంచి పాపులారిటీ తెచ్చిపెట్టింది. స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సోనియా అగర్వాల్ 29 సంవత్సరాలకే క్యారక్టర్ ఆర్టిస్ట్ గా అక్క, వదిన పాత్రలు చేయాల్సి వచ్చింది. సోనియా అగర్వాల్ కోలీవుడ్ డైరెక్టర్ సెల్వ రాఘవన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సెల్వ రాఘవన్ ను పెళ్లి చేసుకోవడానికి సోనియా తల్లి మొదట ఒప్పుకోలేదు. వీరి పెళ్లిని ఆమె వ్యతిరేకించారు.
Advertisement
కానీ అప్పటికే సెల్వ రాఘవన్ తో ప్రేమలో మునిగిపోయిన సోనియా ఆమె మాటలు పట్టించుకోకుండా పెళ్లి చేసుకున్నారు. కొంత కాలం వీరిద్దరూ అన్యోన్యంగా బాగానే ఉన్నారు. కానీ.. సెల్వ రాఘవన్ తాను డైరెక్ట్ చేస్తున్న సినిమాలలో నటిస్తున్న అమ్మాయిలతో క్లోజ్ గా ఉండడం సోనియా అగర్వాల్ కి నచ్చలేదు. దీనితో వారిద్దరి మధ్యా గొడవలు వచ్చేవి. అతనికి బుద్ధి చెప్పాలి అని అనుకున్న సోనియా తానుకూడా బయటకు తిరగడం స్టార్ట్ చేసింది. తమిళ్ నటుడు శింబుతో పబ్స్ వెంట తిరిగి మీడియా కంట్లో పడింది.
Advertisement
వీరిద్దరిపైనా వార్తలు కూడా చాలానే వచ్చేవి. దీనితో సెల్వ రాఘవన్ కు చాలా కోపం వచ్చింది. వీరిద్దరి మధ్య గొడవలు మరింత ముదిరి చివరకు డివోర్స్ వరకు వెళ్లాయి. అప్పుడు కూడా సోనియా తల్లి డివోర్స్ వద్దని కాపురాన్ని చక్కదిద్దుకోమని చెప్పినప్పటికీ.. ఆమె పంతంతో సెల్వ రాఘవన్ నుంచి విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి క్యారక్టర్ రోల్స్, కోలీవుడ్ సీరియల్స్ లో నటిస్తున్న సోనియా డబ్బు కోసమే నటించాల్సిన పరిస్థితి వచ్చింది. మరోవైపు సెల్వ రాఘవన్ తన అసిస్టెంట్ డైరెక్టర్ అయిన గీతాంజలిని వివాహం చేసుకుని ముగ్గురు పిల్లలను కన్నారు.
మరిన్ని..