Advertisement
55 పరుగులకే ఓడిపోయిన శ్రీలంక.. క్రికెట్ బోర్డుని రద్దు చేస్తూ సంచలన నిర్ణయం!చింది. తొలి మూడు మ్యాచ్ లు ఓడిపోయిన శ్రీలంక నాలుగవ మ్యాచ్ నెదర్లాండ్స్ తో ఆడి గెలిచింది. ఆ తరువాత అన్నీ ఓటమిలే. ఇంగ్లాండ్ తో ఓ మ్యాచ్ తప్ప ఇంకే మ్యాచ్ ను గెలవలేదు. ఇటీవల ఇండియాతో జరిగిన మ్యాచ్ లో కూడా 55 పరుగులకే ఆల్ అవుట్ అయ్యారు. ఇది ఆ జట్టు మానసిక స్థైర్యాన్ని కూడా దెబ్బ తీసినట్లు ఐంది.
Advertisement
ఈ మ్యాచ్ లో కనీస ఆటతీరుని కూడా ప్రదర్శించని ఆటగాళ్లపై శ్రీలంక క్రీడా శాఖ అసంతృప్తి వ్యక్తం చేసింది. రీసెంట్ గా జరిగిన ఇండియా శ్రీలంక మ్యాచ్ లో ఐదుగురు ఖాతా కూడా తెరవకుండానే అవుట్ అయిపోయారు. ఈ ఓటములపై క్రీడాశాఖ మంత్రి రోషన్ రణసింఘేవీక్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనితో ఏకంగా శ్రీలంక జట్టునే రద్దు చెయ్యాలని శ్రీలంక క్రీడాశాఖ భావిస్తోంది. భారత్ పై అవమానకర రీతిలో ఓడిపోవడమే దీనికి కారణం అని తెలుస్తోంది.
Advertisement
మరో కారణం ఏంటంటే.. జట్టులో అవినీతి ఎక్కువగా ఉందని.. అందుకే అప్పటికప్పుడు మధ్యంతర బోర్డుని ఏర్పాటు చేసి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఇప్పటికే మధ్యంతర బోర్డుని ఏర్పాటు చేసినట్లు ఓ ప్రకటన కూడా విడుదల అయ్యింది. ఈ కమిటీకి చైర్మన్ గా అర్జున్ రణతుంగని నియమించారు. ఈ ప్యానెల్ లో మాజీ క్రీడా ప్రెసిడెంట్ తో పాటు సుప్రీం కోర్ట్ మాజీ న్యాయమూర్తి కూడా ఉంటారు. మొత్తం ఇందులో ఏడుగురు సభ్యులు ఉంటారట. క్రీడా శాఖా మంత్రి రణసింఘే క్రికెట్ బోర్డుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. క్రికెట్ బోర్డులో అవినీతి ఎక్కువైందని.. వీరెవ్వరికీ పదవిలో ఉండే అర్హత లేదని ఆయన మండిపడ్డారు. మరోవైపు ఓటమిల కారణంగా బోర్డుపై నిరసనలు వెల్లువెత్తే అవకాశం ఉండడంతో కొలొంబో పోలీస్ యంత్రాంగం బందోబస్తుని ఏర్పాటు చేసింది.
Read More:
Bharateeyudu 2: భారతీయుడు 2 సినిమాలో శంకర్ మిస్ అయిన ఈ లాజిక్ ను గమనించారా?