Advertisement
బాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ టీవీ యాంకర్, కమెడియన్ కపిల్ శర్మ అంటే తెలియని వారు ఉండరు. ఆయన తన కామెడీతో సినిమాల్లోనే కాకుండా చాలా స్టేజ్ షోలు కూడా చేశారు. వీటి ద్వారా ఆయన ఎంతో పాపులర్ అయ్యారు. తన హాస్యంతో ప్రతి ఒక్కరిని కడుపుబ్బా నవ్వించడానికే కనిపించడం ఈయన ప్రత్యేకత. ఈమధ్య సోషల్ మీడియాలో ఆయన ఫోటోలు మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి. అందులో ఆయన డెలివరీ బాయ్ గా కనిపిస్తూ రోడ్డుపై బైక్ నడుపుతూ దర్శనమిచ్చాడు.
Advertisement
Also Read: భార్య ఇలా ఉంటే భర్తకి బాగా నచ్చుతుందట.. ఇందులో 4 పాయింట్ తప్పనిసరిగా చూడండి..!
బైక్ పై కూర్చున్న కపిల్ శర్మ ఒక కంపెనీకి చెందినటువంటి పసుపు రంగు టీ షర్ట్ ను వేసుకొని, వెనకాల బ్లూ కలర్ బ్యాగుతో కనిపించాడు. అంతేకాకుండా చేతికి వాచీ పెట్టుకొని బ్లాక్ కలర్ హెల్మెట్ ధరించి ఉన్నారు. సాధారణంగా ఫుడ్ డెలివరీ చేసే వారు ఇలాంటి బ్యాగులు వెనుక తగిలించుకొని ఆహారాన్ని పంపిణీ చేస్తూ ఉంటారు. ఈ తరుణంలో కపిల్ శర్మ ఓ సినిమాలో నటిస్తున్నాడు. అందులో ఆయన డెలివరీ బాయ్ పాత్రలో చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ లో భాగంగా ఈ ఫోటోని ఎవరో తీశారని, దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.
Advertisement
Also Read: అల్లు అర్జున్ ‘అలా వైకుంఠపురం’ సినిమాలో ఉన్న అందమైన ఇల్లు ఎవరిదో తెలుసా ?
అయితే ఈ సినిమాకు హీరోయిన్ నందితా దాస్ దర్శకత్వం వహిస్తోంది. ఈ మూవీలో శర్మ డెలివరీ బాయ్ గా పని చేస్తూ జీవనోపాధి పొందుతారని తెలుస్తోంది. ఫోటోలు మనం నిశితంగా గమనిస్తే ఎడమవైపున ఒక కారులో కెమెరాలు కూడా కనిపిస్తున్నాయి. దాని డోర్ వెనకనుంచి తెరిచే ఉన్నది. కెమెరామెన్ దాన్ని ఆపరేట్ చేస్తూ ఉండటం మనం గమనించవచ్చు. కపిల్ శర్మ చేస్తున్న ఈ సినిమాలో సహానా గోస్వామి హీరోయిన్ గా నటిస్తోందని తెలుస్తోంది.
ALSO READ; రహస్యంగా పెళ్లి చేసుకొని వార్తల్లో నిలిచిన 4 గురు హీరోయిన్లు వీరే…!