Advertisement
ధనుష్, సంయుక్త జంటగా డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో శ్రీకర స్టూడియో సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై తెరకెక్కిన సినిమా సార్. సాంగ్స్, ట్రైలర్ అభిమానులని, ఆడియన్స్ మెప్పించడంతో ముందు నుంచే ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. ఫిబ్రవరి 17న సార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి మంచి విజయం సాధించింది. మౌత్ టాక్ తో ఈ సినిమా అందరికీ చేరువవుతుంది. అయితే, సార్ సినిమా లాగే సినిమాలో హీరోలు టీచర్ గా నటించిన సినిమాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
Advertisement
# చిరంజీవి – మాస్టర్
మాస్ కి పెట్టింది పేరు అయిన చిరంజీవి, కళ్ళద్దాలు పెట్టుకుని డిఫరెంట్ లుక్ లో ‘మాస్టర్’ రాజ్ కుమార్ క్యారెక్టర్ లో అదరగొట్టేసారు.
# బాలకృష్ణ – సింహ
బాలకృష్ణ క్లాస్ గా కనిపిస్తూ, తప్పుదోవ పడుతున్న స్టూడెంట్స్ ని సరిచేయడానికి మాస్ పద్ధతిని వాడే శ్రీమన్నారాయణ అనే లెక్చరర్ పాత్రలో ఇరగదీసారు.
# వెంకటేష్ – సుందరకాండ
వెంకటేష్ కెరియర్ లో ‘సుందరకాండ’ స్పెషల్ మూవీ. లెక్చరర్ తో స్టూడెంట్ ప్రేమాయణం తర్వాత జరిగే పరిణామాలు ఆకట్టుకుంటాయి.
# జగపతిబాబు – మూడు ముక్కలాట
దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు, జగపతిబాబుని ‘మూడు ముక్కలాట’ లో లెక్చరర్ గా చూపించారు.
Advertisement
# రవితేజ – మిరపకాయ్
మాస్ మహారాజ రవితేజ ‘మిరపకాయ్’ మూవీలో లెక్చరర్ ని చేశారు హరీష్ శంకర్.
# విజయ్ దేవరకొండ – గీతాగోవిందం
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ‘గీతగోవిందం’ లో కాసేపు లెక్చరర్ గా కనిపిస్తాడు.
# కమల్ హాసన్ – ప్రొఫెసర్ విశ్వం
కమల్ హాసన్ హిస్టరీ ప్రొఫెసర్ గా నటించిన తమిళ్ ఫిలిం ‘నమ్మవర్’
# మమ్ముట్టి – టీచర్ / కాలేజ్ ప్రొఫెసర్
మమ్ముట్టి పలు చిత్రాల్లో టీచర్ పాత్రలు చేశారు. ‘అనుబంధం’, ‘మాస్టర్ పీస్’ వంటి సినిమాల్లో పాఠాలు చెప్పారు.
READ ALSO : మీరు టాయిలెట్ లో ఫోన్ వాడుతున్నారా.. అయితే ఈ విషయాలను తప్పక తెలుసుకోండి..!
# మోహన్ లాల్
మోహన్ లాల్ కూడా వెండితెర మీద విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పారు. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’, ‘వెలి పాడింటే పుస్తకం’ సినిమాలో ఆయన ప్రొఫెసర్ గా కనిపించారు.
# సార్-ధనుష్
ధనుష్, సంయుక్త జంటగా డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో శ్రీకర స్టూడియో సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై తెరకెక్కిన సినిమా సార్.
READ ALSO : Telugu News, Tollywood Cinema Telugu News