Advertisement
Indira Gandhi : సీఎం జగన్ పై రాళ్ల దాడి జరిగిన విషయం మనకి తెలిసిందే. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ రాళ్లదాడులు ఇప్పుడు మొదలైనవి కావు. ఇందిరా గాంధీ కాలం నుండి కూడా వున్నాయి. ముక్కు ఎముక విరిగిన కూడా ఇందిరాగాంధీ ప్రసంగం ఆపలేదు. రాళ్లు మీద పడుతున్నా కూడా ఆమె ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. దాదాపు 50 ఏళ్ల నాటి చరిత్ర ఇది. రాజకీయ నాయకులు కి ఇలా జరగడం ఈనాటి విషయం కాదు. 1967లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇందిరాగాంధీ మీద దుండగులు రాళ్లు విసిరారు. ఆమె ముక్కు ఎముక విరిగిపోయింది. రాజకీయ నాయకుల మీద సభల్లో రాళ్లు విసరడం ఇప్పుడే కాదు. ఇందిరా కాలం నుండి కూడా ఉంది.
Advertisement
Also read:
1967 ఫిబ్రవరి 8 ఒడిస్సా భువనేశ్వర్లో ఒక మైదానంలో కాంగ్రెస్ ఎన్నికల సమావేశం జరిగింది. వేదిక మీద పలువురు నాయకులు ఉన్నారు. ఎదురుగా మద్దతుదారులు ఉన్నారు ఇందిరా తొలిసారి ప్రధాని బాధ్యతలు చేపట్టిన తొలి రోజుల్లో జరిగిన మీటింగ్ అప్పుడు ఇదంతా చోటు చేసుకుంది. ఇందిరాగాంధీ మీద దుండుగులు రాళ్లు విసిరారు ఇందిరా మాట్లాడుతుంటే రాళ్ల వర్షం కురిసింది. ఒక పక్క ముక్కు ఎముక విరిగిపోయిన సరే రక్తస్రావమైన సరే ప్రసంగాన్ని ఆపలేదు. ఆమె పై పెదవులు వాచిపోయాయి అయినా సరే ఆమె ఆగలేదు. రాళ్ల వర్షం మధ్య ఇందిరా దేశాన్ని ఇలాగే నిర్మిస్తావా ఇలాంటి వారికి ఓటేస్తారా అని ప్రశ్నించారు.
Advertisement
Also read:
వేదిక మీద నుండి వెళ్లిపోవాలని విజ్ఞప్తి చేసిన ఆమె ఒప్పుకోలేదు ఏమాత్రం బెదిరిపోకుండా ముక్కుకి క్లాత్ చుట్టుకుని ప్రసంగాన్ని ముగించారు. భువనేశ్వర్ నుండి ముక్కుకు క్లాత్ కట్టుకొని కోల్కత్తా కి వెళ్లారు. కోల్కతాలో ప్రజలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. తర్వాత ఢిల్లీలోని ఆసుపత్రికి వెళ్లారు. గాయం తీవ్రత కారణంగా ఇందిరా ముక్కుకి గాయానికి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది శస్త్ర చికిత్స చేసారు. ఆమె మీద దాడిని అన్ని పార్టీలు కూడా బహిరంగంగా ఖండించాయి. భువనేశ్వర్ ఘటనకి ముందు జైపూర్ లో జరిగిన బహిరంగ సభలో కూడా ఇంద్రకీలాంటి పరిస్థితి ఎదురైంది ఆమె ప్రసంగాన్ని అనేకసార్లు అంతరాయం కలిగించాలని చూశారు కానీ ఆమె మాత్రం ఏమాత్రం బెదిరిపోకుండా అలానే ముగించారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!