Advertisement
సూపర్ స్టార్ కృష్ణ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు ట్రెండ్ సెట్టర్ ఎవరంటే సూపర్ స్టార్ కృష్ణ అని చెప్పవచ్చు. ఈయన ఎన్నో హిట్ చిత్రాలలో నటించి ఒక ప్రత్యేకమైన రికార్డును సాధించుకున్నారు. విభిన్న చిత్రాలను తీయడంతో పాటు కలర్ సినిమాలను పరిచయం చేసింది కృష్ణనే అని చెప్పుకుంటారు. కృష్ణ నటించిన అన్ని సినిమాలలో సింహాసనం సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సింహాసనం చిత్రం అప్పట్లో బాహుబలి సినిమాతో పోల్చవచ్చు. అప్పట్లో ఈ మూవీస్ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. కృష్ణకి 1980 లలో జానపద చిత్రాన్ని తీయాలని ఉండేది.
Advertisement
Read also: చిరంజీవిని నా పక్కనే కూర్చుంటావా..? అని అవమానించిన హీరోయిన్ ఎవరంటే ?
దీంతో సింహాసనం చిత్రాన్ని ప్రారంభించారు. 3.50 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించాలనుకున్నారు కృష్ణ. ఒకవేళ మూవీ ఫ్లాప్ అయితే నిర్మాతలు తీవ్రంగా నష్టపోతారని భావించి ఆయనే స్వయంగా తన పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించాలని భావించారు. అలా ఈ సినిమాని తెరకెక్కించారు. ఇక దీనికి స్వయంగా కృష్ణనే దర్శకత్వం కూడా వహించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో నిత్యం పేపర్లలో ఈ మూవీ షూటింగ్ కి సంబంధించిన వార్తలు వచ్చేవి. దీంతో ప్రేక్షకులలో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. అలాగే ఈ చిత్రంలో బాలీవుడ్ నటి మందాకిని తో పాటు జయప్రద, రాధ కూడా నటించారు. ఈ చిత్రం 2 నెలలలోనే షూటింగ్ పూర్తి అయింది. అప్పట్లో 50 లక్షల బడ్జెట్ సినిమా అంటేనే చాలా పెద్దది.
Advertisement
కానీ ఈ మూవీకి ఏకంగా మూడున్నర కోట్లు పెట్టి తెలుగుతో పాటు హిందీలో కూడా చిత్రీకరించారు. హిందీలో జితేంద్ర నటించారు. ఈ క్రమంలోనే ఈ మూవీని 1986 మార్చ్ 21న రిలీజ్ చేశారు. ఈ చిత్రం తెలుగుతోపాటు హిందీలోనూ విడుదలై సంచలనాలను సృష్టించింది. ఊహించిన దానికంటే అధికంగా కలెక్షన్స్ వచ్చాయి. మొదటివారం మూవీ 1.51 కోట్లను గ్రాస్ సాధించగా.. సింగిల్ థియేటర్లో 15 లక్షల గ్రాస్ వసూలు చేసింది. విశాఖపట్నంలో 100 రోజులు ఆడింది సింహాసనం. ఈ మూవీ సృష్టించిన మరో రికార్డ్ ఏంటంటే 100 రోజుల వేడుకకు ఏకంగా 400 బస్సులలో ఫ్యాన్స్ వచ్చి చరిత్ర సృష్టించారు. ఈ మూవీ టికెట్ కోసం ఏకంగా 12 కిలోమీటర్ల మేర క్యూ లైన్లు ఉన్నాయి. అలా కృష్ణ సింహాసనం మూవీ అప్పట్లో సాధించిన రికార్డులు అన్ని ఇన్ని కావు.
Read also: ఇప్పటి వరకు మీరెప్పుడు చూడని టాలీవుడ్ సెలెబ్రెటీల 25 +పెళ్లి ఫోటోలు !