Advertisement
Tollywood Actress Surekha Vani Photos: టాలీవుడ్ ఫిమేల్ యాక్టర్ లలో సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంతో మంచి గుర్తింపును తెచ్చుకున్న ఈమె సినిమాలలో కన్నా సోషల్ మీడియాలో ఎక్కువగా పాపులర్ అయింది. ఇండస్ట్రీలో వదినగా, అక్కగా, ఆంటీ గా ఎన్నో పాత్రలలో నటించి మెప్పించింది. ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పెళ్లీడుకొచ్చిన కూతురు ఉన్నా సరే ఇంకా యవ్వనంగానే మెరుస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే భర్త చనిపోయినప్పటి నుంచి ఆమె సింగిల్ గానే ఉంటుంది.
Advertisement
Read also: విడాకుల తర్వాత సమంత తన తాళి బొట్టును ఏం చేసిందో తెలుసా?
ఇదిలా ఉంటే.. 1981 ఏప్రిల్ 29న ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో జన్మించింది సురేఖ వాణి. పాఠశాలలో చదివే సమయంలోనే అనేక సంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనేది. ఎనిమిదవ తరగతి చదివే సమయంలోనే విజయవాడలోని ఒక ప్రాంతీయ ఛానల్ లో పిల్లల కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఇక ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత పూర్తిస్థాయి వ్యాఖ్యాతగా మారింది. ఇక పెళ్లయిన తర్వాత తన భర్త దర్శకత్వంలో వచ్చిన “మొగుడ్స్ పెళ్ళామ్స్” అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించింది. సురేఖ వాణి భర్త తేజ అనారోగ్య సమస్యలతో చాలా ఏళ్ల క్రితమే చనిపోయారు.
ఇటీవల సురేఖ వాణి రెండవ పెళ్లిపై కూడా సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. ఈ రూమర్స్ పై ఓ ఇంటర్వ్యూలో స్పందించిన సురేఖ వాణి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను రెండవ పెళ్లికి దూరంగా ఉండాలని అనుకున్నాను కానీ తాను మళ్ళీ పెళ్లి చేసుకుంటే చూడాలని ఉందని కూతురు సుప్రీత అడుగుతోందని సురేఖ వాణి చెప్పింది. సుప్రీత కోరిక భవిష్యత్తులో తీరుతుంది కావచ్చునని పేర్కొంది. ముఖ్యంగా తన మనసుని బాగా అర్థం చేసుకునే వాడు కావాలని, అలాంటివాడు దొరికితే తప్పకుండా అతడినే పెళ్లి చేసుకుంటానని తెలిపింది. అయితే ఇంత వయసు వచ్చిన ఈమె గ్లామర్ చెక్కుచెదరలేదు అని చెప్పాలి. ఈ విషయాలను పక్కన పెట్టేసి ఈమె రేర్ పిక్స్ ను ఓ లుక్కేద్దాం రండి.
Advertisement