Advertisement
ఎస్వీ కృష్ణారెడ్డి చాలా అందంగా, అద్భుతంగా కథలను రాయగలరు. మ్యూజిక్ కంపోస్ చేయగలరు కూడా. అలాగే సినిమాలని కూడా డైరెక్ట్ చేయగలరు. ఆయన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక గొప్ప డైరెక్టర్ గా మిగిలిపోయారు. మాయలోడు, శుభలగ్నం, మావిచిగురు ఇలా సూపర్ హిట్ సినిమాలను తీసి ఎంతోమంది ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేశారు. ఈయన వల్లే అలీ పాపులర్ అయిపోయారు. యమలీల చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. మామూలు కమెడియన్ ని స్టార్ హీరో చేశారు ఎస్ వి కృష్ణారెడ్డి. ఆయన మాత్రం సక్సెస్ అవ్వలేకపోయారు.
Advertisement
ఎస్వీ కృష్ణారెడ్డి ఉగాది, అభిషేకం సినిమాల్లో హీరోగా నటించారు ఆయన సక్సెస్ కాలేకపోయారు. ఎందుకు అనే ప్రశ్న ఇంటర్వ్యూలో చెప్పారు. దానికి ఆయన సమాధానం చెబుతూ సినిమాలో స్క్రిప్ట్ స్క్రీన్ ప్లే బాగుంటే ఎవరైనా స్టార్ హీరో అవ్వచ్చు. ఒకానొక సమయంలో నాకోసం ఒక స్క్రిప్ట్ రాసుకున్నాను. కానీ అలాంటి కాన్సెప్ట్ తో చాలా మూవీస్ వచ్చాయని అందరూ చెప్పడంతో పక్కన పెట్టేసానని తర్వాత ఉగాది సినిమా తీశాను అందులో నేనే హీరో అది మంచి హిట్ అయింది. వంద రోజులు ఆడిందని అన్నారు.
Advertisement
Also read:
అభిషేకం సినిమాకి వచ్చేసరికి సాటిస్ఫై అవ్వలేదని అభిషేకం సినిమా టీవీలో హిట్ అయింది కానీ ఆ రోజుల్లో మాత్రం మంచిగా ఆడలేదని అన్నారు. హీరోగా నటించి తప్పు చేసానని.. తర్వాత మిస్టేక్ తెలుసుకొని హీరోగా చేయకూడదని నిర్ణయించుకున్నాను అని అన్నారు. నేను హీరోగా నటించిన రెండు సినిమాలకు ఎవరి చేత డబ్బులు పెట్టించలేదు అని చెప్పారు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!