Advertisement
డబ్బులు లేకపోతే ఏదీ లేదు. ప్రతీది కూడా డబ్బుతో ముడిపడి ఉంటుంది అయితే సాధారణంగా మనం ఉపయోగించే కాయిన్స్ లేదా నోట్ల మీద కొన్ని కొన్ని చిహ్నాలు ఉంటాయి. ఎక్కువగా నాణేల మీద కొత్త కొత్త చిహ్నాలు మనం గమనిస్తూ ఉంటాము నాణేల మీద అప్పుడప్పుడు స్పెషల్ గా కొన్ని చిహ్నాలను ముద్రిస్తూ ఉంటారు. అయితే వాటిపై ఉన్న గుర్తులకి అర్థం ఏంటి..? అసలు వాటిని ఎందుకు ముద్రిస్తారు అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 2007లో రెండు వేళ్ళను చూపించే గుర్తు అలాగే డన్ 👍 గుర్తు ఒకటి కాయిన్స్ మీద ముద్రించారు.
Advertisement
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ వారు దీనిని డిజైన్ చేశారు అలాగే మన సంస్కృతిని ప్రతిపాదించేందుకు కూడా కాయిన్స్ మీద కొన్ని చిహ్నాలు ముద్రించారు. అయితే ఎందుకు ఇలా ముద్రించారు అనేది చూస్తే.. అంధులు చూడలేరు కాబట్టి వాళ్ళకి అర్థమయ్యే విధంగా రూపాయి కాయిన్ మీద ఒక వేలు చూపించే విధంగా రెండు రూపాయలు మీద రెండు వేళ్ళు చూపించే ముద్రించారు.
Advertisement
Also read:
Also read:
50 పైసలు మీద గుప్పెడు సింబల్ ముద్రించారు. దానిని ముష్టిముద్ర అంటారు. రూపాయి నాణెం మీద ఉండే దాన్ని శిఖర ముద్ర అంటారు రెండు రూపాయలు మీద ఉండే ముద్రని కర్తరిముఖముద్ర అని పిలుస్తారు. అయితే నిజానికి మనం వాటిని చూసి ఉంటాము. కానీ వాటి అర్థం ఇదే అని ఇప్పటి దాకా చాలామందికి తెలియదు ఇలా మన సంస్కృతిని సూచించే విధంగా నాణేలను ముద్రించారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!