Advertisement
టాలీవుడ్ హీరో నందమూరి వారసుడు తారకరత్న కన్నుమూసి నేటికీ నెల రోజులు అవుతోంది. ఈ నేపథ్యంలో భర్తను తలుచుకుంటూ అలేఖ్య రెడ్డి ఎమోషనల్ అయ్యారు. సోషల్ మీడియాలో భర్తతో కలిసి దిగిన పలు ఫోటోలను షేర్ చేసి వాటికి ఎమోషనల్ వాక్యాలను రాసుకు వచ్చారు. అలేఖ్య రెడ్డి తన పోస్టులో నువ్వు మమ్మల్ని వదిలి నేటికీ నెల అవుతుంది. కానీ నీ జ్ఞాపకాలు మమ్మల్ని దహించి వేస్తున్నాయి. మన స్నేహం ప్రేమగా మారింది. నేను బయపడినా నువ్వు మాత్రం మనం కలిసి జీవిస్తామని ధైర్యంగా చెప్పావు.
Advertisement
READ ALSO : బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని ఎక్కడ ఉంటుంది.. ఏం చేస్తుందో తెలుసా..?
అప్పటినుండి ఆ క్షణం కోసం ఎంతో పోరాడావు. చివరికి మన పెళ్లి జరిగిపోయింది. అయినప్పటికీ ఈ పెళ్లి ఓ గందరగోళం. మనపై వివక్ష అయిన నువ్వు నాతో ఉన్నందుకు సంతోషంగా ఉన్నాను. నిషికమ్మ పుట్టిన తర్వాత మన జీవితమే మారిపోయింది. కానీ కష్టాలు మాత్రం అలానే ఉన్నాయి. మనపై చిమ్ముతున్న విషయాన్ని తట్టుకునేందుకు మనం గంతలు కట్టుకొని బ్రతికాం. కుటుంబానికి నువ్వు దూరం అయ్యావు.
Advertisement
READ ALSO : మరో కొత్త వివాదానికి తెరలేపిన బాలకృష్ణ.. ఈసారి టార్గెట్ అక్కినేని నాగార్జున?
కాబట్టి మనకు పెద్ద కుటుంబం ఉండాలని కోరుకున్నావు. 2019లో కవలలు జన్మించడంతో ఆ కల నెరవేరింది. నీ చివరి క్షణం వరకు ఎన్నో కష్టాలు పడ్డావు. నీ గుండెల్లో ఉన్న బాధ ఎవరికి అర్థం కాలేదు. కనీసం దాన్ని పట్టించుకోలేదు కూడా. మనకు సపోర్ట్ గా ఉన్నవాళ్లు కూడా మనల్ని వదిలేశారు. చివరికి నువ్వు కూడా వదిలేసావు. నువ్వు రియల్ హీరోవి. మనం మళ్ళీ కలుస్తామని ఆశిస్తున్నాను అంటూ అలేఖ్య రెడ్డి తన పోస్టులో పేర్కొంది.
READ ALSO : నవీన్ కేసులో గర్ల్ ఫ్రెండ్ నిహారిక చెప్పిన సంచలన విషయాలు కొత్తగా వెలుగులోకి…!