Advertisement
నందమూరి తారకరత్న కేవలం 39 సంవత్సరాల వయసులోనే కన్నుమూశారు. ఆయన మరణం నందమూరి అభిమానులకు మరియు వారి కుటుంబానికి తీరని దుఃఖాన్ని మిగిల్చింది.. తారకరత్నకు భార్య అలేఖ్య రెడ్డి, ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఆయన మరణంతో వారు అనాధలు అయిపోయారు. ఈ కష్టకాలంలో తారకరత్న భార్యకు అండగా విజయసాయిరెడ్డి, చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ లాంటి పెద్ద నేతలు మేమున్నామని చెప్పినప్పటికీ ఆమె మనసుకు భరోసా ఇచ్చే విధంగా ఏ ఒక్కరు కూడా ప్రవర్తించలేకపోతున్నారు. ఇకపోతే తారకరత్న అలేఖ్య రెడ్డిని కుటుంబ సభ్యులను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు.
Advertisement
also read: “చిరంజీవి” నుంచి “ధనుష్” వరకు సినిమాల్లో మాస్టర్ గా నటించిన 10 స్టార్స్ వీరే !
వేరే కులానికి చెందిన అమ్మాయి పైగా ముందే మొదటి భర్తతో విడాకులు కూడా అవడంతో అలాంటి కోడలు తమ ఇంటిలోకి ఆహ్వానించడానికి మోహన కృష్ణ ఆసక్తి చూపలేదు. దీంతో సుమారుగా 10 సంవత్సరాల పాటు తన కుటుంబానికి దూరమయ్యాడు తారకరత్న. ఇటీవల ఆయన మరణించినా కూడా తండ్రి మోహన్ కృష్ణ తల్లి 23 రోజులపాటు నారాయణ బెంగుళూరు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ మృత్యువుతో పోరాడిన సందర్భంలో కూడా ఒక్కసారి చూడడానికి పోలేదు. అంటే వారి మధ్య చిచ్చు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొడుకు ఎలాగో పోయాడు..
Advertisement
also read:చనిపోయిన వారి ఫోటోలని దేవుడి పూజ గదిలో పెడుతున్నారా ?
కనీసం కోడలు మనవడు, మనవరాళ్లకైనా అండగా నిలవాల్సిన మొహానకృష్ణ కుటుంబం ఇప్పటికి కూడా వారి వైపు చూడకపోవడం అందరినీ ఆశ్చర్యాన్ని గురిచేస్తోంది. ఈ తరుణంలోనే తారకరత్న తల్లి శాంతి, అలేఖ్య రెడ్డి బాధను చూడలేక ఆమెతో మాట్లాడినట్టు తెలుస్తోంది. పర్సనల్ గా శాంతి మోహన్ అలేఖ్య రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడిందట. అంతేకాకుండా పిల్లలతో కూడా మాట్లాడినట్టు సమాచారం. ఏది ఏమైనా తారకరత్న మరణించిన తర్వాత కూడా మోహనకృష్ణ మొండి పట్టుదలతో ఉండడంతో అందరూ విమర్శలు చేస్తున్నారు.
also read: