Advertisement
నందమూరి తారకరత్న మరణం ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులలో తీరని వేదన మిగిల్చింది. నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభంలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుకి గురై బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో 23 రోజులుగా మృత్యువుతో పోరాడి చివరికి శివరాత్రి రోజున తుదిశ్వాస విడిచారు. ఇప్పుడిప్పుడే రాజకీయంగా అడుగులు వేస్తున్న ఆయన చివరి కోరిక తీరకుండానే కన్నుమూశారు. తారకరత్న రాజకీయాలలోకి రావడమే కాకుండా ఏదైనా ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని టిడిపి అధిష్టానానికి చెప్పినట్లు తెలుస్తోంది.
Advertisement
Read also: చనిపోయిన వారి ఫోటోలని దేవుడి పూజ గదిలో పెడుతున్నారా ?
అయితే అటునుండి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందని టాక్ నడిచింది. ఈ క్రమంలోనే నారా లోకేష్ తో ఆ మధ్య తారకరత్న భేటీ కూడా అయ్యారు. రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చి తన తాత, బాలయ్య లాగే తారకరత్న కూడా ప్రజాసేవ చేయాలని ఒక కోరిక ఉండేదట. అంతేకాదు తారకరత్న చివరి కోరిక కూడా ఇదేనట. కానీ చివరి కోరిక తీరకుండానే తారకరత్న కన్నుమూశారని తెలిసి కుటుంబ సభ్యులతో పాటు ఆయన అభిమానులు కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అయితే రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చి ప్రజాసేవ చేద్దామనే కోరిక ఒకటే కాకుండా.. బాలయ్య సినిమాలో కూడా ఆక్ట్ చేయాలనే కోరిక కూడా ఉండేదట తారకరత్నకి.
Advertisement
అయితే ఈ రెండు కోరికలు తీరకుండానే విగథజీవిగా మారిపోయారు తారకరత్న. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయి అందరిని శోకసంద్రంలో ముంచారు. అయితే తారకరత్న రెండు కోరికలలో ఒక కోరికని నెరవేర్చేందుకు ఆయన భార్య అలేఖ్య రెడ్డి సిద్ధమయ్యారట. తన భర్త ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే కోరికను తను నెరవేర్చేందుకు ప్రయత్నం మొదలుపెట్టారట. అందుకు నందమూరి బాలకృష్ణ, నారా చంద్రబాబు కూడా మద్దతిస్తున్నారట. అలేఖ్య రెడ్డిని టిడిపి మహిళా విభాగం నేతగా మార్చి.. అటునుండి ఎమ్మెల్యేగా మార్చాలని వీరిద్దరూ ప్లాన్ కూడా చేశారట. ఇప్పుడు ఈ వార్త టిడిపి పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.
Read also: MAHESH BABU AND NTR: మహేష్, ఎన్టీఆర్ ఇద్దరి జీవితాల్లో ఉన్న కామన్ పాయింట్స్ !
https://tv9telugu.com/videos/entertainment-videos/nandamuri-taraka-ratna-wife-alekhya-reddy-will-going-to-active-in-politics-video-au61-899859.html