Advertisement
మాజీ ఎమ్మెల్యే, బిజెపి నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మరో షాక్ తగిలింది. ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో… గోరంగా ఓడిన కోమటిరెడ్డికి… ఐటీ అధికారులు దిమ్మతిరిగే షాక్ ఇస్తున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందిన సుశీ ఇన్ ఫ్రా లో జిఎస్టి అధికారులు తనిఖీలు చేస్తున్నారు. రాష్ట్రానికి చెందిన జీఎస్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. నవంబర్ 14న మధ్యాహ్నం 12 గంటల నుంచి సుమారు 20 మంది అధికారులు సోదాలు జరుపుతున్నారు.
Advertisement
హైదరాబాద్ లోని సుశీ ఇన్ ఫ్రా కార్యాలయంలోని రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. సుశీ ఇన్ ఫ్రా అండ్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందిన కంపెనీ. ఇందులో జీఎస్టీ సిబ్బంది తనిఖీలు చేయడం కలకలం రేపింది. పన్ను ఎగవేత ఆరోపణల పై జిఎస్టి అధికారులు సోదాలు జరుపుతున్నారు. సుశీ ఇన్ ఫ్రా కూచన్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుమారుడు సంకీర్త్ రెడ్డి ఎండీగా వ్యవహరిస్తున్నారు. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో దృష్టి సారించిన అధికారులు, సంస్థ నిర్వహిస్తున్న వ్యాపారానికి సంబంధించి జిఎస్టి చెల్లింపుల్లో వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు సంస్థలపై కేసు నమోదు చేశారు.
Advertisement
వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ నీతూ ప్రసాద్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. సుశీ ఇన్ ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్, సుశీ అరుణాచల్ హైవేస్ లిమిటెడ్, సుశీ చంద్రగుప్త్ కోల్ మైన్స్ లిమిటెడ్ అనే మూడు కంపెనీల ప్రధాన కార్యాలయం బంజారాహిల్స్ లో ఉంది. సుశీ ఇన్ ఫ్రా కంపెనీలో ఇద్దరూ, అరుణాచల్ హైవేస్ లిమిటెడ్ కంపెనీలో నలుగురు, సుశీ చంద్ర గుప్త్ కోల్ మైన్స్ లో ముగ్గురు డైరెక్టర్లు ఉండగా, వాళ్ల ఇళ్లల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. ఈ తనిఖీల్లో అధికారులు డాక్యుమెంట్ లతో పాటు హార్డ్ డిస్క్ లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కాగా, ఈ సోదాలకు సంబంధించిన విషయాన్ని వాణిజ్య పన్ను ల శాఖ పూర్తి గోప్యంగా ఉంచింది. ఇక ఈ కేసు వివరాలు తెలియాల్సి ఉంది.