Advertisement
100+ Telugu Samethalu in Telugu language, తెలుగు సామెతలు వాటి అర్థాలు !: సాధారణంగా మనం అప్పుడప్పుడు సామెతలను వాడుతుంటాం. సామెతలు అంటే.. ప్రజల భాషలో మళ్లీ మళ్లీ వాడబడే వాక్యాలు అని అర్థం. భాషా సౌందర్యం, అనుభవసారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి.
Advertisement
ముఖ్యంగా సామెతలు ప్రసంగానికి దీపాల్లాంటివి అవి సంభాషణకు కాంతిని ఇస్తాయి. సామెతలో ధ్వని ఉంటుంది. ప్రసంగోచితంగా ఒక సామెతను ప్రయోగిస్తే.. పాలల్లో పంచదార కలిపినట్టు ఉంటుంది. సామెతలు సూత్రప్రాయంగా చిన్న వాక్యాలుగా ఉంటాయి.
ఒక జాతి నాగరికతను చెప్పకనే చెబుతుంటాయి సామెతలు. పూర్వతరాల అనుభవ సారాన్ని తెలియజేసే అమృత గుళికలు చెప్పవచ్చు. ఇలాంటి సామెతలను కొన్నింటిని ఇప్పుడు మనం తెలుసుకుందాం.
- నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది.
సాధారణంగా మన నోటి నుంచి వచ్చే వాక్యాలు కత్తికంటే కూడా చాలా పదునైనవి. మనం మాట్లాడే మాట నిస్వార్థంగా ఉండాలి. అప్పుడే మన చుట్టూ ఉన్న వాళ్లు కూడా నిస్వార్థంగా ఉండగలుగుతారు. ఎప్పుడు అయితే ఒకరిని చూసి మరొకరు నిస్వార్థంగా ఉండటం నేర్చుకుంటారో అప్పుడే ఆ ఊరు కూడా మంచిది అవుతుందని ఈ సామెత యొక్క అర్థం.
Find the 100+ Telugu Samethalu in Telugu language, తెలుగు సామెతలు వాటి అర్థాలు
- భయం లేని కోడి బజారులో గుడ్డు పెట్టిందట
బజార్ లో పెడితే ఎవ్వరైనా దానిని ఎత్తుకెళ్లారు అని తెలిసి కూడా కోడి గుడ్డు పెట్టిందంటే దానికి అస్సలు భయం లేదని అర్థం. అలాగే ఏదైనా పని చేసేటప్పుడు దాని పర్యావసనాలు ఆలోచించి చేయాలని చెబుతోంది ఈ సామెత.
3. ఇచ్చేవాడిని చూస్తే, చచ్చినవాడు కూడా లేచి వస్తాడు
ఉచితంగా ఏదైనా దొరుకుతుంది అంటే దానిని దక్కించుకోవడానికి ఏదైనా చేస్తాం. ఎందుకు అంటే.. ఆశ అనేది ఎవ్వరికైనా సర్వసాధారణం. కానీ కొంతమందిలో ఇది చాలా ఎక్కువ పాళ్ళలో చూస్తాం. అలా అత్యాశ ఉన్నవారి గురించి చెప్పే సామెత ఇది.
4.వసుదేవుడంతటివాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు
ఎంతటి వాడికైనా ఒక్కోసారి కాలం కలసి రాకపోతే ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుంది. వారి జీవితం ముందుకి సాగాలి అంటే ఎంతటి స్థాయికైనా దిగాల్సి వస్తుంది. అలాంటి సంధర్భాల్లో ఈ సామెత చెబుతుంటారు.
All Telugu Samethalu with Meaning in Telugu Text
5. కళ్ళు కావాలంటాయి కడుపు వద్దంటుంది
ఆశకొద్దీ ఎక్కువ పదార్థాలు వడ్డించుకున్నా తినలేకపోవటం. ఆకలితో ఉన్నప్పుడు ఎంతో తినాలని ఆశ పడతారు. తీరా తినడానికి కూర్చున్నాక తన కడుపుకు పట్టినంత మాత్రమే తినగలరు. ఆ ఉద్దేశంతో చెప్పినదే ఈ సామెత.
6.కుడి చేతితో చేసే దానం ఎడమ చెయ్యి ఎరుగరాదు!
నిస్వార్థంగా చేసే దాన్నే దానం అంటారు. తిరిగి ఏమైనా ఆశిస్తే (పుణ్యం కూడా) దాన్ని వ్యాపారం అంటారు. అందుకే పెద్దలు కుడి చేత్తో చేసిన దానం ఎడమ చేతికి తెలీకూడదు అంటారు. మనం చేసిన మంచి కనపడేటప్పుడు మనం కనపడనవలసిన అవసరం లేదు అని చెప్తోంది ఈ సామెత.
7.దయగల మొగుడు తలుపు దగ్గరకు వేసి కొట్టాడట.
దయగల వాడు అయితే పెళ్ళాన్ని కొట్టకుండా వుండాలి కాని, ఎవరకీ తెలియకుండా జాగ్రత్త పడటం ఏంటి.. కొంతమంది ఇలాగే నలుగురి ముందూ మంచిగా ఉండాలి ఇంట్లో ఎలా ఉన్నా ఫర్వాలేదు అన్నట్టు ఉంటారు. అలాంటి వాళ్ళను గూర్చి చెప్పేదే ఈ సామెత.
8.అక్కరకు వచ్చినవాడే మనవాడు.
అక్కర అంటే అవసరం. మనకు అవసరం ఉన్నప్పుడు, ఆపద సమయాలలో సహాయపడిన వారే మన ఆప్తులు అవుతారు. అంతే కానీ, అవసరమైనప్పుడు సహాయపడని బంధువులు ఉన్నా కానీ లేనట్టే లెక్క. అంటే వారు వ్యర్ధమని, మనవారు కాలేరని ఈ సామెత.
Advertisement
9.అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్లు.
సాధారణంగా అల్లుడంటేనే విశేష గౌరవ మర్యాదలు చూపడం మన సంప్రదాయం. ఇక విందు భోజనాలకి చెప్పనవసరం లేదు. కాని ఎన్ని చేసినా ఏదో ఒక కారణంగా అల్లుడు తినలేని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అలాగే కొంతమందికి అన్నీ అందుబాటులో ఉన్నప్పటికీ అనుభవించటానికి ఏదో కారణంగా ఆటంకాలు ఉంటాయి. అలాంటి సమయంలో ఈ సామెతని వాడుతుంటారు.ప్రభుత్వ నిధులు ఎన్ని ఉన్నా ఆ ఫలాలు సామాన్యులకు అందవు. ఇలాంటి సందర్భంలో ఈ సామెతను గుర్తు చేసుకోవచ్చు.
10.పేరు గొప్ప ఊరు దిబ్బ.
ఉదాహరణకి కొన్ని దుకాణాలకు సురుచి అని, రుచి అని ప్రసిద్ధమైన వంటకాల రుచులకు ప్రసిద్ధి అని వాటి గొప్పదనాన్ని చాటుకునేలా బోర్డులు తగిలిస్తారు. విపరీతమైన ప్రచారం సాగిస్తారు. అది నమ్మి ఆ హోటల్‍కు వెళ్తే.. అక్కడి వంటకాలు రుచి చూస్తే ఆశించిన స్థాయిలో ఉండవు. అలాంటి సందర్భంలో నిట్టూరుస్తూ మనసులో అనుకునే మాటే ఇది. పేరు చూసి నమ్మి మోసపోయాం.. ఇంకెప్పుడూ ఆ హోటల్‍కు వెళ్లకూడదు అనుకునే సందర్భంలో ఈ సామెతను వాడతారు.
11.పొరుగింటి పుల్ల కూర రుచి!
పొన్నగంటి కూర, చుక్క కూరలను పుల్ల కూరలంటారు. పులుపు చాలామందికి పడదు కారణం దగ్గును తెస్తుంది కనుక. ఆలాంటి పుల్ల కూరలు కూడ పక్కింటి వాళ్ళు చేస్తే రుచికరంగా ఉంటాయి. ఇంట్లో భార్య ఎంత అందంగా ఉన్నా, ఎంత రుచికరంగా వంట చేసినా, వంకలు పెడుతూ పొరుగు లేదా పరాయి స్త్రీల పట్ల వ్యామోహం పెంచుకొని శరీర ఆరోగ్యం చెడగొట్టుకోవద్దని మర్మ గర్భంగా మనకి చెప్పడం ఈ సామెత ఉద్దేశం.
12.తూర్పుకు తిరిగి దండం పెట్టు!
ఎవరికన్నా ఎదన్నా ఇచ్చినప్పుడు ఒకవేళ ఆ మనిషి తిరిగి మళ్ళీ మనది మనకి ఇవ్వలేని పరిస్తితి వచ్చిన సందర్భంలో ఈ సామెత వాడతారు. సరే తూర్పుకే ఎందుకు తిరిగి దండం పెట్టాలి? వేరే దిక్కులు లేవా అంటే.. తూర్పుని మనం పుణ్యమైన దిక్కుగా అభివర్ణిస్తాం.
ఇంద్రుడు దానికి అధిపతి. సూర్యుడు కూడా తూర్పు నుండే ఉదయిస్తాడు. అందుకే ఇళ్ళల్లో కూడా ఎదన్నా పూజా కార్యక్రమాలు చేసుకుంటున్నా తూర్పు ముఖంగా కూర్చోమని అంటారు. కనుక తూర్పుకి తిరిగి దండం పెడితే, ఇక నీ పోయిన సంపద వల్ల కనీసం నీకు పుణ్యం అయినా దక్కుతుంది అని అలా సరదాగా అంటారు.
13. తెగించి దానం చేస్తా తేరా పిడికెడు రాళ్ళు అన్నాడట.
నేను ఉదారవాదిగా ఉండాలని నిర్ణయించుకున్నాను, చేతినిండా ధాన్యం తీసుకురండి అన్నాడట ఒక రాజు. వారి ఉదారత అంతా ఆ గుప్పెడు ధాన్యం పంచటంలోనే ఉందన్నట్టు!!
మాటలు కోటలు దాటటం లాంటిదే ఇదీనూ. కొందరు చేసే హడావిడి అంతా ఇంతా కాదు, కాని అసలు చేసేది శూన్యం
Telugu Samethalu PDF / తెలుగు సామెతలు pdf – Check Here
14.అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లు!
దుత్త అంటే కడవ. కోడలు అత్తగారి మీద కోపంతో ఆవిడని ఏమీ అనలేక దుత్తని పగులగొట్టిందట. ఆ విధంగా ఆవిడపై కోపాన్ని తీర్చుకుంది. ఇలా ఒకరి మీద కోపాన్ని వేరొకరి మీద చూపిస్తున్న సందర్భంలో ఈ సామెత వాడతారు.
15. అన్యాయపు సంపాదన ఆవిరైపోతుంది
నిజాయితీగా మంచి పద్ధతిలో సంపాదించిన ధనము నిలకడగా మనదగ్గరే ఉండి, మనకు ఎంతో ఉపయోగపడుతుంది. అదే విధంగా అన్యాయంగా ఆర్జించిన సొమ్ము మన దగ్గర నిలబడక, వృధాగా ఖర్చు అయి కనిపించకుండా పోతుంది. ధన సంపాదనకు అన్యాయ మార్గాన్ని ఎంచుకోరాదని ఇందులోని గూడార్థం.
16. నిండా మునిగిన వాడికి చలేంటి!
చన్నీళ్లలో దిగేటప్పుడు మొదట్లో చలిగా వుంటుంది. పూర్తిగా దిగాక చలి వుండదు. అలాగే కష్టాలు ఒకటి రెండు వస్తే మనిషి తమాయించుకోగలడు. అన్ని కష్టాలు ఒక్కసారిగా వస్తే అతనికి తెగింపు వచ్చేస్తుంది. ఆ అర్థంతో ఈ సామెత పుట్టింది.
Also Read: 50 Best Podupukathalu With Answers