Advertisement
సాధారణంగా క్రికెట్ స్టేడియంలో మనం ప్లేయర్స్ వేసుకున్న టీషర్ట్ లను చూస్తూనే ఉంటాం. ఒక్కో ప్లేయర్ కు ఒక్కో విధమైన నెంబర్ ఉంటుంది. మరి ఆ నెంబర్స్ ఎందుకు ఉంటాయి అనేది ఓ సారి తెలుసుకుందాం..? క్రికెట్ ఆడే టప్పుడు ప్లేయర్స్ వేసుకునే టీషర్ట్ ని జెర్సీ అంటారు. వారు గ్రౌండ్ లో ఆడుతున్నప్పుడు ఎవరు ఆడుతున్నారో వారి పేరు, వారి జెర్సీ నెంబర్ ఉంటుంది. అయితే ఆ టీ షర్ట్ పై పేరు చిన్నగా, నెంబర్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఒక్కొక్క ఆటగాడికి ఒక్కో విధమైన జెర్సీ నెంబర్ ఉంటుంది. ఈ నెంబరు ఉండడంవల్ల కామెంటేటర్స్, స్కోర్ కీపర్స్, ఎంపైర్స్, అభిమానులు కెమెరాల్లో ప్లేయర్ ను చాలా ఈజీగా గుర్తించవచ్చు.
Advertisement

Advertisement

also read;
ఇండియాకు బ్రిటిష్ వారు వదిలిపెట్టిన 7 పద్ధతులు తెలిస్తే ఆశ్చర్యపోతారు..?
 



