Advertisement
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్నటువంటి టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో మొదటి స్థానంలో ఉంటారు దేవి శ్రీ ప్రసాద్. ఈయన మ్యూజిక్ అంటే ఇష్టపడని వారు ఉండరు. అలాంటి దేవిశ్రీప్రసాద్ టాలీవుడ్ లో ‘దేవి’ అనే సినిమాతో మొట్టమొదటిసారి వచ్చారు. అప్పటినుంచి మొదలైన ఆయన ప్రస్థానం అంచలంచలుగా ఎదుగుతూ వచ్చింది. మొన్నటికి మొన్న మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలో తన సంగీతంతో అదరగొట్టేసారు.
Advertisement
also read: 1980లో టాలీవుడ్ హీరోలు ఎంత రెమ్యూనరేషన్ తీసుకునే వారో తెలుసా?
ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం దేవిశ్రీప్రసాద్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఇంతకీ అది ఏంటయ్యా అంటే .. నాలుగు పదుల వయసు దాటినటువంటి దేవిశ్రీ ఇంకా వివాహం చేసుకోలేదు..ఈ తరుణంలోనే ఆయన ఒక ఇంటి వాడు కాబోతున్నాడని వార్త చెక్కర్లు కొడుతోంది..ఇక దేవిశ్రీ చేసుకునే అమ్మాయి ఎవరో కాదు దేవిశ్రీప్రసాద్ దూర బంధువుల అమ్మాయట. ఆమె వరసకి మరదలు అవుతుందట. వీరిద్దరికీ సుమారు 17 సంవత్సరాల గ్యాప్ ఉంటుందని తెలుస్తోంది.
Advertisement
also read: Rashi Phalalu in Telugu 2023 : ఈ రోజు రాశి ఫలాలు 04.04.2023
కుటుంబ సభ్యుల సమక్షంలో త్వరలోనే వీరి వివాహం జరగనుందని జోరుగా ప్రచారం సాగుతోంది. మరి నెట్టింటా వైరల్ గా మారిన ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో, అబద్ధం ఉందో తెలియదు కానీ, ఆయన పెళ్లి గురించి మాత్రం అనేక వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై దేవిశ్రీ స్పందించి క్లారిటీ ఇస్తే కానీ అసలు విషయం బయటకు రాదు. అప్పట్లో కూడా దేవి ఓ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నారని పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. కానీ అది నిజం కాలేదు.
also read: “బలగం, దసరా”లతో ఏం మెసేజ్ ఇస్తున్నట్టు..తెలంగాణ వారంటే తాగుబోతులేనా..?