Advertisement
ఆమె సచివాలయంలో అగ్రికల్చర్ అసిస్టెంట్, అతను వాలంటీర్. వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ ఇద్దరూ పెళ్ళి చేసుకోవాలని భావించినా.. కులాలు వేరు కావడంతో పెద్దలు అంగీకరించరని భావించారు. ఊరిలోని రామాలయంలో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత పెద్దలు ఏమైనా చేస్తారేమోనన్న భయంతో పెళ్లి చేసుకున్న గుడిలోనే గడియ పెట్టుకుని దాక్కున్నారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లా మచిలీపట్నంలో చోటుచేసుకుంది. కృష్ణాజిల్లా మచిలీపట్నానికి చెందిన గాయత్రి, రూరల్ మండలం బుద్ధపాలెం కు చెందిన నాగరాజు ప్రేమించుకున్నారు.
Advertisement
Read also: పరమ శివుడు పులి చర్మాన్ని ఎందుకు ధరిస్తారు ? దాని వెనకున్న కారణం ఇదేనా ?
గాయత్రి బుద్ధ పాలెం గ్రామ సచివాలయం ఉద్యోగి కాగా.. అదే సచివాలయంలో నాగరాజు వాలంటీర్. ఈ క్రమంలో వీరి ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి.. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే ఇరువురివి వేరు వేరు కులాలు. దీంతో తమ పెళ్లికి పెద్దలు అంగీకరించరనే భయంతో సోమవారం వారు గ్రామంలోని రామాలయంలోకి వెళ్లి పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లిని ఇరువురి కుటుంబ సభ్యులు నిరాకరించారు. దీంతో పెళ్లి చేసుకున్న అనంతరం తమకు పెద్దల నుంచి రక్షణ కల్పించాలంటూ గుడి లోపలే ఉండి తలుపులు వేసుకున్నారు. సోమవారం సాయంత్రం వరకు వారు ఆలయంలోపలే ఉన్నారు.
Advertisement
ఆ తరువాత గ్రామ పెద్దలు వచ్చి తమ కుటుంబాలను ఒప్పిస్తేనే తలుపులు తెరుస్తామని చెప్పడంతో.. ప్రేమజంట వ్యవహారం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ విషయం తెలుసుకున్న రూరల్ సీఐ రవికుమార్, ఎస్ఐ చాణక్య గ్రామ పెద్దల సహాయంతో ఇద్దరినీ బయటకు తీసుకువచ్చి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అనంతరం ఇరువురి తరపు బంధువులను స్టేషన్ కి రావాలని సూచించారు. కానీ ఇరువురి తరపు బంధువులు పోలీస్ స్టేషన్ కి వచ్చేందుకు నిరాకరించారు. ఆ తరువాత ప్రేమికులు ఇరువురు మేజర్ లు కావడంతో పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి గ్రామ పెద్దల సమక్షంలో వారిని ఇంటికి పంపించారు.
Read also: YCP రజిని ని ఇంత ఘోరంగా ఎందుకు ట్రోల్ చేస్తున్నారు ? ఆయన చేసిన తప్పు ఏంటి?