Advertisement
ఆల్బర్ట్ ఐన్ స్టీన్ 1879 మార్చి 14న జర్మనీ దేశంలోని వుర్టెంబెర్గ్ రాజ్యంలోని ఉల్మ్ ప్రాంతంలో జన్మించారు. వంకరటింకర తలతో పుట్టిన అతన్ని చూసి తల్లిదండ్రులు నిరాశ చెందారు. డిగ్రీ పూర్తయ్యాక ఐన్ స్టీన్ కోసం ఉద్యోగం వెతికి పెట్టేందుకు అతని తండ్రి చాలా కష్టపడ్డారు. తన మీద పెద్దగా నమ్మకం లేని ఐన్ స్టీన్ సైతం చిన్న ఉద్యోగం వస్తే చాలని అనుకున్నాడు. ఇక జర్మనీ పౌరసత్వాన్ని వదులుకొని స్విట్జర్లాండ్ లో స్థిరపడాలని నిర్ణయానికి వచ్చాడు. అక్కడే అతని జీవితం సరికొత్త మలుపు తిరిగింది. ఆయన పని చేస్తున్న కార్యాలయం శాస్త్రవేత్తల పేటెంట్ హక్కులను నమోదు చేస్తుంది.
Advertisement
ఆ విధంగా ఐన్ స్టీన్ సైతం ఎన్నో పేటెంట్లను పొందాడు. శక్తి రంగంలోనే కీలక అంశమైన మాస్ ఎనర్జీ ఈక్వలెన్స్ ఫార్ములా E=mc2 ను కనిపెట్టారు. క్వాంటం థియరీ పరిణామ క్రమం, సాపేక్ష సిద్ధాంతం, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ లా, అణుబాంబు వంటి ఎన్నో ఆవిష్కరణలను కనుగొన్నారు. ఇది ఇలా ఉండగా. ఐన్‌స్టీన్ శాకాహారి అని అందరికీ తెలిసిన విషయమే. అతను 1920లో, కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న తర్వాత అతను ప్రత్యేకమైన ఆహారం తీసుకోవడం ప్రారంభించారట. అయితే, అతను శాకాహారానికి మారిన సరైన తేదీ మాత్రం లేదు. కానీ 1930లో శాఖాహార ఆహారం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మరియు దానిని తాను ఎంతగా ఆస్వాదిస్తున్నాడో వివరించాడు ఐన్‌స్టీన్.
Advertisement
తాను చాలాసార్లు బయటి వారి బలవంతం కారణంగా మాంసం తినవలసి వచ్చిందని చెప్పాడు. శాఖాహారం ఒక వ్యక్తి జీవన విధానాన్ని సానుకూలంగా ప్రభావితం చేస్తుందని తెలిపారు. మొత్తం మానవజాతిపై గొప్ప ప్రభావాన్ని చూపుతుందని ఆయన పేర్కొన్నారు. అయితే, అతను చనిపోవడానికి ఒక సంవత్సరం ముందు మాత్రమే, కఠినమైన శాఖాహారానికి మారాడని కూడా వెల్లడైంది. కాగా, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ 1955లో మరణించాడు. ఐన్‌స్టీన్ చనిపోయే ముందు.. అంటే మార్చి 30, 1954 నాటి ఓ లేఖ కూడా వైరల్ అయింది. “ఇక నా జీవితంలో కొవ్వు, మాంసం లేదా చేపలు లేవు. నిజానికి మాంసాహారం గొప్పగా అనిపిస్తుంది. మనిషి మాంసం తినేవాడిగా పుట్టకూడదు.” అంటూ ఐన్‌స్టీన్ లేఖ రాశారట.
Also Read: మీ పాదాల వేళ్ల బట్టి.. మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు…ఎలానో తెలుసా !