Advertisement
తెలుగు సినిమాల్లో ఉండేటటువంటి స్టార్ హీరోలలో నాగార్జున కూడా ఒకరు. తన తండ్రి ఏఎన్నార్ నటవారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో కింగ్ నాగార్జున గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి నాగార్జున తన తండ్రి పేరు నిలబెట్టడమే కాకుండా ఎంతగానో ఆస్తిపాస్తులు కూడా సంపాదించారు. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్నారు.
Advertisement
ఇక తన సినీ కెరీర్ విషయంలో అన్ని బాగానే ఉన్నా.. తన పర్సనల్ విషయంలో మాత్రం నాగార్జున చిన్న మిస్టేక్ చేశారు. మొదట రామానాయుడు కూతురు లక్ష్మీని పెళ్లి చేసుకున్నాడు. వీరి దంపతులకు నాగచైతన్య పుట్టిన తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చారు. ఆ తర్వాత నాగ్ తో హీరోయిన్ తో చేసిన అమలను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత అఖిల్ రెండవ సంతానంగా జన్మించారు. అలాంటి నాగార్జున పెళ్లి చేసుకున్న అమల ఎవరు.. ఆమె బ్యాగ్రౌండ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
అమల తల్లి ఐర్లాండ్ కు చెందిన మహిళ. ఆమె బెంగాలీ నేవీ అధికారి ముఖర్జీని ప్రేమ వివాహం చేసుకున్నది. అమల తల్లి ఇండియాలో హాస్పటల్ మేనేజ్మెంట్ ఉద్యోగం చేసే సమయంలో కొన్నాళ్లపాటు చెన్నై, వైజాగ్ ప్రాంతాల్లో నివసించారు. అలా అమల తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి పరిచయమైంది. అలా నాగార్జున అమల మధ్య ప్రేమ పుట్టి వివాహానికి దారితీసింది. అయితే అమల అందరికీ తెలుసు కానీ వారి తల్లిదండ్రులు తెలుగు అభిమానులకు తెలియదు.
అయితే తాజాగా అమల నాగార్జున అఖిల్ కలిసి అమలా తల్లితో దిగినటువంటి ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోలో అమల తల్లి నాగార్జున అత్తగారు కనిపించడంతో చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఈ సందర్భంగా చాలా మంది అభిమానులు అఖిల్ సేమ్ అమ్మమ్మ లాగే ఉన్నారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.