Advertisement
సాధారణంగా ఆర్టీసీ బస్సులు చాలా చిన్నగా వెళ్తుంటాయి. ప్రైవేట్ బస్సులు చాలా ఫాస్ట్ గా వెళ్తుంటాయని అందరూ అంటుంటారు. కానీ ఇప్పుడు ప్రైవేటు బస్సులకు ధీటుగా ఆర్టీసీ బస్సులు చాలా వేగంగా వెళ్తున్నాయి. ఇక మహారాష్ట్రకు చెందిన ఓ ఆర్టీసీ బస్సు అయితే ఏకంగా టాప్ లేచిపోయినా కానీ ఆగకుండా రహదారిపై దూసుకుపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గడ్చిరోలి జిల్లా అహెరి నుంచి గడ్చిరోలికి నిత్యం బస్సు షటిల్ ట్రిప్పులు తిరుగుతుంది.
Advertisement
Advertisement
ప్రతీ రోజూ మాదిరిగానే ఉదయం 6.30 గంటలకు అహెరి నుంచి గడ్చిరోలికి బస్సు బయలుదేరి 10.30 గంటలకు చేరుకుంది. తిరిగి 11.00 గంటలకు అహెరికి బయలు దేరింది. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో మాల్ చర్ల-అల్లపల్లి ప్రాంతంలో దాని టాప్ (పైకప్పు) పైకి లేచింది. ఆ రోడ్డు మార్గంలో వెళ్లే ఇతర వాహనాల్లో వెళ్లే యువకులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. ఇక విషయం గురించి గడ్చిరోలి ఆర్టీసీ అధికారులు మాట్లాడుతూ.. బస్సు టాప్ కింది భాగంలో మరో రేకులాంటిది ఉండటం వల్లనే ప్రయాణికులకు ఈ విషయం తెలియరాలేదు. డిపో వద్దకు చేరుకున్న తరువాత బస్సుకు మరమ్మతులు చేశామని తెలిపారు.