Advertisement
తెలంగాణలో అప్పుడే ఎన్నికల హడావుడి ప్రారంభమైంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ప్రధాన పార్టీలన్నీ సమాయత్తం అవుతున్నాయి. ఈనేపథ్యంలోనే ప్రధాన పార్టీలు ఎన్నికల్లో గెలుపు కోసం సర్వం సిద్ధమవుతున్నాయి. మూడో సారి గెలిచి హ్యాట్రిక్ సాధించి తమ సత్తా చాటాలని అధికార బీఆర్ఎస్ ఆరాటపడుతుండగా.. ఇక ఒక్క చాన్స్ అంటూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ ప్రజలను కోరుతున్నాయి. ఈనేపథ్యంలో అధికార బీఆర్ఎస్ ను ఢీకొట్టేందుకు బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు పోరాడుతున్నాయి.
Advertisement
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న కాంగ్రెస్ కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ కి చెందిన కీలక నేతలు కూడా కాంగ్రెస్ లో చేరుతున్నారు. బీజేపీలోని కీలక నేతలు కూడా కాంగ్రెస్ లోనే చేరుతున్నారు. దీంతో కాంగ్రెస్ కు బలం రోజురోజుకూ పెరుగుతోంది. కర్ణాటకలోనూ కాంగ్రెస్ పార్టీ గెలుపుతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూల పవనాలు వీస్తున్నాయి. అదే ఊపుతో తెలంగాణలోనూ విజయం సాధించి మరోసారి కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటాలని భావిస్తోంది. అందుకే ఈసారి 119 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను బరిలోకి దింపేందుకు ప్రయత్నిస్తోంది.
Advertisement
గతంలో తమ పార్టీలో పని చేసిన తీన్మార్ మల్లన్నను మరోసారి ఆహ్వానించనున్నట్టు సమాచారం. ఆయన ఇప్పటికే కొత్త పార్టీ పెట్టారు. ఆ పార్టీ తరుపున పోటీ చేస్తారని అనుకున్నారు. కానీ.. సొంతంగా పోటీ చేయడం కంటే హస్తం పార్టీ నుంచి పోటీ చేస్తే బాగుంటుందనే ఆలోచనలో మల్లన్న ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి మల్లన్న పోటీ చేస్తే విజయం ఖాయం అని తెలుస్తోంది. మల్లారెడ్డి లాంటి అభ్యర్థిని ఢీకొట్టాలంటే మల్లన్న లాంటి క్యాండిటేట్ అయితేనే కరెక్ట్ అని కాంగ్రెస్ కూడా భావిస్తోందట. మేడ్చల్ నియోజకవర్గంలో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత పోరు నడుస్తోంది. మేడ్చల్ లో మల్లారెడ్డి, సుధీర్ రెడ్డి మధ్య అంతర్గత పోరు నడుస్తున్న నేపథ్యంలో ఈ గ్యాప్ ను సానుకూలంగా మార్చుకొని అక్కడ కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఫస్ట్ నుంచి మల్లారెడ్డి మీద తీన్మార్ మల్లన్న ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. అందుకే నేరుగా మేడ్చల్ లో మల్లారెడ్డిని మల్లన్న ఢీకొట్టబోతున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి మల్లన్నను పోటీ చేయిస్తే మేడ్చల్ సీటు కాంగ్రెస్ ఖాతాలో పడుతుందని భావిస్తున్నారు. ఏం జరుగుతుందనేది చూడాలి మరీ.
Also Read :
మంత్రి కేటీఆర్ పై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
హీరో నాగార్జునకి రైతుబంధు డబ్బులు అవసరమా ? రిటైర్డ్ ఐఏఎస్ సంచలన వ్యాఖ్యలు