Advertisement
కాటుక పెట్టుకోవడం అనేది మన పూర్వ కాలం నుంచి వస్తున్నటువంటి ఒక సంప్రదాయం. అయితే పుట్టిన పిల్లలు, కొంతమంది యువతులు కూడా కళ్ళకు కాటుక పెట్టుకుంటారు. అదే పూర్వకాలం నుంచి పెద్దలు కాటుక అనేది పుట్టిన పిల్లలకు ఎందుకు పెడతారో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు కానీ, ఆ కాటుక వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం..?
Advertisement
స్త్రీలకు ఐదోతనం గా సూచించే సుమంగళ ద్రవ్యాలలో కాటుక ఒకటి. ఇది కళ్లకు రాసుకోవడం ద్వారా కంటిలోని ఎర్రటి చారలు కూడా తొలగిపోతాయి. కంటిని శుభ్రంగా ఉంచడంలో కాటుక పాత్ర చాలా కీలకంగా ఉంటుందని చెప్పవచ్చు. అలాగే మనకు బయటినుంచి వచ్చేటువంటి దుమ్ము ధూళిని కూడా కళ్ళ లోకి వెళ్లకుండా కాటుక కాపాడుతుంది. కళ్ళను తాజాగా ఉంచుతూ,మెరుస్తూ ఉండేలా చేస్తుంది. సూర్య కిరణాలు నేరుగా కళ్ళలో పడితే చాలా ప్రమాదకరం, కాటుక పెట్టుకోవడం వల్ల సూర్యకిరణాలు పడినా పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు. కాటుక పెట్టుకోవడం వల్ల వేడి తగ్గి చలువ చేస్తుందని ఆయుర్వేద వైద్యులు చెబుతూ ఉంటారు.
Advertisement
కాగితం రాసుకోవడం వల్ల కళ్ళు ప్రశాంతంగా ఉండి నిద్ర బాగా పడుతుంది. కాటుక పెట్టుకోవడం వల్ల కళ్ళకు అందంగా ఉండటమే కాకుండా, అనేక కళా హావభావాలు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఏదైనా స్పీచ్ ప్రజెంటేషన్ డెమో ఇచ్చేవారు కాటుక పెట్టుకోవడం వల్ల కళ్లు విశాలంగా కనిపించడమే కాకుండా చూసే వారు మనల్ని ఇంట్రెస్ట్ గా చూస్తూ ఏకాగ్రతతో ఉంటారు. కొంత మంది కాటుక పెట్టుకుంటే కళ్ళు మండుతాయి. దీనికి ప్రధాన కారణం కళ్ళలోని దుమ్ము బయటకు వెళ్లే క్రమంలోనే ఆ కళ్ళు మండుతాయి అని తెలుసుకోండి.
ALSO READ;
రాత్రిపూట గోర్లు కట్ చేయకూడదని పెద్దలు అంటారు.. కారణమేంటో తెలుసా..?