Advertisement
రీమేక్ సినిమా అంటే మినిమం గ్యారంటీ ఉంటుందని నమ్ముతారు. ఒక భాషలో హిట్ అయిన చిత్రాలను మరో భాషలో రీమేక్ చేయడం సర్వసాధారణం. ఆ కథను ప్రేక్షకులు ఆదరించారు కనుక.. ఎక్కడైనా ఆ కథ నచ్చుతుంది అనుకోవడం నమ్మకం. దాదాపు ప్రతి హీరో రీమెక్ సినిమాల్లో నటించిన వారే. రీమేక్ తో విజయాలు అందుకొని స్టార్డం నిలుపుకున్న వారు ఉన్నారు.
Advertisement
అలాగే ఎంతో నమ్మకంతో రీమేక్ చేసి దెబ్బతిన్న నిర్మాణ సంస్థలు కూడా ఉన్నాయి. జాగ్రత్తగా డీల్ చేస్తే హిట్ కొట్టొచ్చు కానీ ఏ మాత్రం తేడా కొట్టినా అసలుకే ఎసరు తప్పదు. అలా మన తెలుగులో ఇతర భాషల చిత్రాలు రీమేక్ చేసి సూపర్ హిట్స్ కొట్టారు మేకర్స్. అయితే ఇప్పుడు కొన్ని తమిళ్, కన్నడ, హిందీ మూవీస్ రీమేక్స్ చేసి డీలపడ్డ టాలీవుడ్ స్టార్స్ ఎవరు..? ఆ 10 సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
Read also: టాలీవుడ్ లో ఒకటికి మించి పెళ్లిళ్లు చేసున్న స్టార్ సెలెబ్రెటీలు వీరేనా ?
1) పవన్ కళ్యాణ్ – తీన్ మార్.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన చిత్రం తీన్ మార్. హిందీలో సైఫ్ అలీ ఖాన్ చేసిన చిత్రం “లవ్ ఆజ్ కల్”. హిందీలో ఘనవిజయం సాధించిన ఈ మూవీ కథలో కొంత నేటివిటీని జోడించి తీన్మార్ పేరుతో రీమేక్ చేశారు . ఈ మూవీలో సాంగ్స్, సీన్స్, డైలాగ్స్ బాగుంటాయి కానీ సినిమా అనుకున్నంతగా ఆడలేదు.
2) చిరంజీవి – శంకర్ దాదా జిందాబాద్.
బాలీవుడ్ లో ఘనవిజయం సాధించిన “మున్నాభాయ్ MBBS” చిత్రం రీమేక్ తో సూపర్ హిట్ కొట్టిన మెగాస్టార్ చిరంజీవి.. దాని సీక్వెల్ “లగేరహో మున్నాభాయ్” రీమేక్ గా ” శంకర్ దాదా జిందాబాద్” చేయగా అది డిజాస్టర్ అయింది.
3) నాగార్జున – స్నేహమంటే ఇదేరా.
సిద్ధిక్ దర్శకత్వంలో మలయాళంలో వచ్చిన ఫ్రెండ్స్ అనే చిత్రాన్ని తెలుగులో బాల శేఖరన్ రీమేక్ చేశారు. ఈ చిత్రంలో నాగార్జున, సుమంత్, సుధాకర్, భూమిక లు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో సాంగ్స్ బాగానే ఉంటాయి కానీ సినిమానే తేడా కొట్టింది.
4) రవితేజ – వీడే.
Advertisement
తమిళ్ లో చియాన్ విక్రమ్ నటించిన ” ధూల్” సినిమాని 2003లో రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో రవితేజ హీరోగా, ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా రీమేక్ చేశారు. కానీ ఈ చిత్రంలో రవితేజ మార్క్ కామెడీ మిస్ కావడం, పైగా సీరియస్ కథ కావడంతో ఆకట్టుకోలేకపోయింది.
5) మోహన్ బాబు – పొలిటికల్ రౌడీ.
తమిళంలో సత్యరాజ్, అబ్బాస్, రతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన “ఆడిథడి” రీమేక్ పొలిటికల్ రౌడీ. ఈ చిత్రంలో కలెక్షన్ కి మోహన్ బాబు – చార్మి నటించారు. కానీ ఇక్కడ మాత్రం ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది.
6) అల్లరి నరేష్ – ధనలక్ష్మి ఐ లవ్ యూ.
మలయాళం లో సూపర్ హిట్ అయిన ” రామ్ జి రావు స్పీకింగ్” రీమేక్ గా తెరకెక్కిన చిత్రం ధనలక్ష్మి ఐ లవ్ యు. ఈ చిత్రంలో సీనియర్ నరేష్, అల్లరి నరేష్, ఆదిత్య ఓం హీరోలుగా నటించారు. ఈ చిత్రం కూడా తెలుగులో డిజాస్టర్ గా నిలిచింది.
7) వినయ్ – వాన.
కన్నడలో బ్లాక్ బాస్టర్ గా నిలిచిన ” ముంగారు మలే” చిత్రాన్ని తెలుగులో “వాన” పేరుతో రీమేక్ చేశారు నిర్మాత ఎమ్మెస్ రాజు. అయితే హీరో వినయ్ కొత్తవాడు, పైగా ఆకట్టుకునే విధానం లేకపోవడంతో తేడా కొట్టేసింది.
8) జగపతిబాబు – బడ్జెట్ పద్మనాభం.
తమిళంలో ప్రభు – రమ్యకృష్ణ నటించిన “బడ్జెట్ పద్మనాభన్” మూవీని తెలుగులో జగపతిబాబు – రమ్యకృష్ణ లతో “బడ్జెట్ పద్మనాభం” గా తెరకెక్కించారు. కానీ ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది.
9) రామ్ – రెడ్.
తమిళ్ లో అరుణ్ విజయ్ నటించిన సూపర్ హిట్ మూవీ ” తడమ్” రీమేక్ గా రామ్ పోతినేని ద్విపాత్రాభినయం చేసిన చిత్రం రెడ్. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదు.
10) శివాజీ – తాజ్ మహల్.
కన్నడంలో సంచలన విజయం సాధించిన తాజ్ మహల్ చిత్రాన్ని అదే పేరుతో రీమేక్ చేశారు. ఈ చిత్రంలో హీరో శివాజీ – శృతి నాయక నాయికలుగా అరుణ్ దర్శకత్వంలో తెరకెక్కించారు. కానీ ఈ చిత్రంలో హీరో చనిపోవడం మన ఆడియన్స్ కి నచ్చలేదు.
Read also: తమ్ముడితో ఎన్టీఆర్ భార్య ప్రణతి.. వైరల్ అవుతున్న క్యూట్ ఫోటోలు..!!