Advertisement
ఇండస్ట్రీలో ఓ నటుడు, లేదా నటి అన్ని సినిమాలలో ఒకే పాత్ర చేయలేరు. ఒక సినిమాలో హీరోగా చేసిన వాళ్లు మరో సినిమాలో ఏ పాత్ర అయినా చేసే అవకాశం ఉంది. ఒక సినిమాలో హీరో పక్కన హీరోయిన్ గా చేసినవారు మరో సినిమాలో హీరో తల్లిగా, లేదా చెల్లిగా నటించే అవకాశం ఉంటుంది. అబ్బా.. ఈ సినిమా అయితే ఆ హీరోకి అదిరిపోతుంది. అబ్బా ఈ క్యారెక్టర్ అయితే ఆ హీరోయిన్ కి భలే సెట్ అవుతుంది అని అనుకుంటూ ఉంటారు. అలాంటి పాత్రల విషయంలో అభిమానులు అభ్యంతరం చెప్పినా నటీనటులు మాత్రం వారి నటనతో మెప్పిస్తారు. సరిగ్గా ఇలానే ఒక సినిమాలో తల్లిదండ్రులుగా చేసిన నటీనటులు మరో సినిమాలో అత్త, మామలుగా చేయవచ్చు. అందుకే గతంలో ఓ సినిమాలో జంటగా లేదా భార్యాభర్తలుగా చేసిన నటీనటులు మరో సినిమాలో అన్నా చెల్లెలుగా చేసిన సందర్భాలు ఉన్నాయి. అలా ఓ సినిమాలో భార్యాభర్తలుగా.. మరో సినిమాలో బ్రదర్, సిస్టర్ గా చేసిన జంటలు ఎవరెవరో తెలుసుకుందాం.
Advertisement
Read also: కృష్ణంరాజు చివరిదాకా అందరికీ భోజనం పెడుతూ వచ్చింది ఎందుకో తెలుసా..!
1) రమ్యకృష్ణ – నాజర్:
రజనీకాంత్ “నరసింహ” సినిమాలో అన్నా, చెల్లెలుగా నటించిన వీరిద్దరూ ” బాహుబలి” సిరీస్ లో భార్యాభర్తలు గా నటించారు.
2) చిరంజీవి – నయనతార:
” సైరా” సినిమాలో భార్యాభర్తలు గా కనిపించిన వీరిద్దరూ ” గాడ్ ఫాదర్” సినిమాలో అన్నా, చెల్లెలుగా కనిపించారు.
3) చిరంజీవి – రమ్యకృష్ణ:
” అల్లుడా మజాకా” , ” ముగ్గురు మొనగాళ్లు” సినిమాలలో చిరంజీవికి జోడిగా నటించిన రమ్యకృష్ణ ” చక్రవర్తి” సినిమాలో చిరుకి చెల్లెలిగా నటించింది.
Advertisement
4) ఎన్టీఆర్ – సావిత్రి:
ఇక ఈ జంట మాత్రం లెక్కలేనన్ని సినిమాలలో హీరో, హీరోయిన్లుగా చేశారు. కానీ.. ” రక్తసంబంధం” సినిమాలో అన్నా, చెల్లెలుగా నటించారు.
5) రాజేంద్రప్రసాద్ – రంభ:
“ఆ ఒక్కటి అడక్కు” సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించిన వీరిద్దరూ.. చిరంజీవి నటించిన ” హిట్లర్” సినిమాలో అన్నా చెల్లెలుగా నటించారు.
6) కృష్ణ – సౌందర్య:
ఈ జంట కూడా చాలా సినిమాలలో హీరో, హీరోయిన్లుగా నటించారు. ” రవన్న” సినిమాలో అన్నా, చెల్లెలుగా చేశారు.
7) ప్రకాష్ రాజ్ – జయసుధ:
బొమ్మరిల్లు, కొత్త బంగారులోకం సినిమాలలో భార్యాభర్తలుగా చేసిన వీరిద్దరూ.. ” సోలో” సినిమాలో మాత్రం అక్కా తమ్ముడిగా కనిపించారు.
8) సురేష్ – సౌందర్య:
” అమ్మోరు” సినిమాలో జంటగా నటించిన వీరిద్దరూ.. ” దేవీపుత్రుడు” సినిమాలో అన్నా చెల్లెలుగాా కనిపిస్తారు.
9) జగపతిబాబు – వాణి విశ్వనాథ్:
” సింహ స్వప్నం” సినిమాలో జంటగా నటించిన వీరిద్దరూ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన “జయ జానకి నాయక” సినిమాలో అన్నా, చెల్లెలుగా కనిపిస్తారు.
10) చంద్రమోహన్ – సుధా:
రవితేజ నటించిన ” కృష్ణ” సినిమాలో భార్యాభర్తలుగా నటించిన వీరిద్దరూ.. ” నువ్వు నాకు నచ్చావ్” సినిమాలో అన్నా, చెల్లెలుగా నటించారు.