Advertisement
ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తోంది. 2022 సినిమా ఇండస్ట్రీకి సరికొత్త బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి. దక్షిణాది సినిమాలు దేశాన్ని ఒక ఊపు ఊపుతున్నాయి. ఇండియాలో ఇప్పుడైతే బాలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేదు. సౌత్ ఇండస్ట్రీలో కూడా కంటెంట్ వర్కౌట్ అయితే అన్ని భాషల ప్రేక్షకులకు చేరువ అవుతుంది. పెద్ద సినిమాలతో పాటు కొన్ని చిన్న చిన్న సినిమాలు కూడా 100 కోట్ల క్లబ్ లో చేరడం విశేషం. గతంలో 100 కోట్లకు చేరుకోవాలంటే కనీసం 10 నుంచి 30 రోజులు పట్టేది. ఇప్పుడు ఒక రోజులోనే లేదా రెండు రోజులలోనే వంద కోట్ల క్లబ్ లోకి చేరుతున్నాయి. అలా తెలుగులో ఎక్కువ 100 కోట్ల క్లబ్ సినిమాలు ఉన్న హీరోలు ఎవరు? ఆ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం..
Advertisement
Read also: రంజితమే పాటలో “రష్మిక” కి మించి అదరగొట్టిన ఈ క్యూట్ భామను గుర్తుపట్టారా ?
1) మహేష్ బాబు:
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన దూకుడు, శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట ఈ 6 చిత్రాలు 100 కోట్ల క్లబ్ లో చేరాయి.
2) ప్రభాస్:
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన బాహుబలి 1, 2, సాహో, రాదే శ్యామ్ చిత్రాలు 100 కోట్ల క్లబ్ లో చేరాయి.
3) అల్లు అర్జున్:
స్టైలిష్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సరైనోడు, దువ్వాడ జగన్నాథం, రేసుగుర్రం, అల వైకుంఠపురంలో, పుష్ప చిత్రాలు 100 కోట్ల క్లబ్ లో చేరాయి.
4) జూనియర్ ఎన్టీఆర్:
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీర రాఘవ, జై లవకుశ, జనతా గ్యారేజ్, నాన్నకు ప్రేమతో చిత్రాలు 100 కోట్ల క్లబ్ లో చేరాయి.
Advertisement
5) పవన్ కళ్యాణ్:
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్, అజ్ఞాతవాసి, వకీల్ సాబ్, దీనిలో నాయక్ చిత్రాలు 100 కోట్ల క్లబ్ లో చేరాయి.
6) మెగాస్టార్ చిరంజీవి:
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150, గాడ్ ఫాదర్, సైరా నరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలు 100 కోట్ల క్లబ్ లో చేరాయి.
7) రామ్ చరణ్:
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన మగధీర, రంగస్థలం చిత్రాలు 100 కోట్ల క్లబ్ లో చేరాయి.
8) నాని:
నాచురల్ స్టార్ నాని నటించిన ఈగ, ఎంసీఏ చిత్రాలు 100 కోట్ల క్లబ్ లో చేరాయి.
9) నందమూరి బాలకృష్ణ:
నందమూరి నాటసింహ బాలకృష్ణ నటించిన అఖండ, నరసింహ రెడ్డి చిత్రాలు 100కోట్ల క్లబ్ లో చేరాయి.
10) వైష్ణవ్ తేజ్ :
వైష్ణవి తేజ్ నటించిన ఉప్పెన చిత్రం 100 కోట్ల క్లబ్ లో చేరింది.
11) నిఖిల్:
నిఖిల్ సిద్ధార్థ్ నటించిన కార్తికేయ 2 చిత్రం 100 కోట్ల క్లబ్ లో చేరి 120 కోట్లకి పైగా వసూలు చేసింది.
12) విజయ్ దేవరకొండ:
రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం చిత్రం 100 కోట్ల క్లబ్ లో చేరింది.
నోట్ : ఈ లిస్టులో కేవలం సోలో హీరో సినిమాలు మాత్రమే ఉన్నాయి.
Read also: అబ్బాయిలలో ఈ లక్షణాలు కనిపిస్తే అమ్మాయిలు ఈ జన్మలో వదిలిపెట్టరు.