Advertisement
గత కొన్ని నెలల నిరీక్షణ, ఎన్నో ఆశలు, భారీ బడ్జెట్ అన్నిటికీ మించి పూరి జగన్నాథ్ డైరెక్షన్ ఇన్ని హంగులు కలిపిన సినిమా అంటే అభిమానులకు ఎన్నో ఆశలు ఉంటాయి. రౌడీ హీరో ఈ సినిమాలో సరికొత్త లుక్ లో బాక్సింగ్ నేపథ్యంలో రావడంతో రోజురోజుకు అభిమానుల నిరీక్షణ పెరిగిపోయింది. ఎప్పుడెప్పుడు థియేటర్లోకి వస్తుందా అని ఎదురు చూశారు.. దీంతో మూవీ ఆగస్టు 25వ తేదీన థియేటర్లోకి రానే వచ్చింది.. పరుగు పరుగున అభిమానులంతా థియేటర్లోకి పరిగెత్తారు.. సినిమా చూశారు.. వారు అనుకున్నంత మాత్రం సినిమా లేదని అంటున్నారు. సినిమాలో చాలా మైనస్ పాయింట్లు ఉన్నాయని, అంతటి స్టార్ హీరో ను పూరి సరిగా వాడుకోలేదని అంటున్నారు..
Advertisement
ALSO READ: అందంతోనే కాదు, నెగిటివ్ రోల్స్ చేసి మెప్పించిన హీరోయిన్లు ఎవరో తెలుసా?
Advertisement
దీంతో మూవీ కి కాస్త నెగిటివ్ టాక్ వచ్చింది.. మరి అది రావడానికి ప్రధాన కారణాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం.. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా కాబట్టి ప్రతి ఒక్కరికీ అనేక అంచనాలు ఉంటాయి. కానీ అంచనాలకు తగ్గట్టుగా సినిమా పర్ఫామెన్స్ లేదని ఫస్టాఫ్ యావరేజ్ గా ఉండగా ఇక సెకండాఫ్ మాత్రం చాలా గందరగోళంగా ఉందని కొంతమంది ప్రేక్షకులు అంటున్నారు. సినిమా ప్రారంభమైనప్పుడు చాలా బాగానే ఉన్నప్పటికీ ముందుకు పోతున్న కొద్దీ ట్రాక్ తప్పిందని అంటున్నారు.
లైగర్ సినిమాలో కథ కాస్త ఇబ్బందిగా ఉన్నా పాటలైనా బాగున్నాయా అంటే అసలు సినిమాకు సంబంధం లేకుండానే పాటలు వచ్చాయి అని చెబుతున్నారు.. ఇందులో ప్రధానంగా మైక్ టైసన్ పాత్ర చాలా బాగుంటుందని అందరూ భావించారు.. కానీ ఆ హాలీవుడ్ నటుడిని సినిమాలో కామెడీ గా మార్చేశారని చెబుతున్నారు.. ఈ కథను రాయడం లోనే పూరి ఫెయిల్ అయ్యారని ప్రేక్షకులు అంటున్నారు. మొదటి రోజైతే గడిచిపోయింది కానీ ముందు ముందు మూవీ కి ఎలాంటి టాక్ వస్తుందో వేచి చూడాల్సిందే..
ALSO READ: తెలంగాణ రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక ?