Advertisement
ఆషాఢ మాస ఏకాదశిని తొలి ఏకాదశి గా జరుపుకుంటారు.దీనినే ప్రధమ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు నుంచే శ్రీమహావిష్ణువు క్షీరాబ్ది యందు శయనీస్తాడు. కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు.
Advertisement
ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు సంకేతంగా చెప్పుకోవచ్చు. మనకు ప్రత్యక్ష దైవం అయినటువంటి సూర్యుడు దక్షిణం వైపు మళ్లినట్లు ఈరోజు నుంచి దక్షిణాయన ప్రారంభం సూచిస్తుంది. అంతేకాకుండా చాతుర్మాస వ్రతం కూడా ప్రారంభమవుతుంది.
ఈ వ్రతాన్ని ఈ రోజుతో మొదలుకొని కార్తీకమాస, శుక్లపక్ష, ద్వాదశి వరకు ఆచరించాలని పురాణాలు సూచిస్తున్నాయి. ఆషాడ మాసం శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్లే సందర్భమును తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీన్ని శయన ఏకాదశి అని కూడా అంటారు. తొలి ఏకాదశి రోజు రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగారం చేసి, మర్నాడు ద్వాదశి నాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే మీ పాపాలన్నీ ప్రక్షాళన అవుతాయని నమ్ముతుంటారు. ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్లీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు.
Advertisement
ఏకాదశి ఉత్థాన ఏకాదశి, ఆ తర్వాత వచ్చే ద్వాదశిని క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. ఈ నాలుగు నెలల కాలాన్ని చాలా పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస్యదీక్ష చేస్తారు. జొన్న పేలాలు, బెల్లం కలిపి దంచుకొని పిండి చేస్తారు. దీనిని ఏకాదశి రోజున కచ్చితంగా తింటారు. అష్టకష్టాలు పడుతున్న మానవజాతిని ఉద్ధరించటానికి సాక్షాత్ శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేశాడని, ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరిస్తే ఆర్థిక అభివృద్ధి కలిగి కుటుంబం బాగుంటుందని నమ్ముతారు. ఇదంతా పద్మపురాణంలో రాయబడింది.
also read: