Advertisement
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి అద్భుతమైన విజయాలను సాధించి చాలామందికి ఇన్స్పిరేషన్ గా నిలిచిన వాళ్లలో ఉదయ్ కిరణ్ ఒకరు. ఇండస్ట్రీలోకి అనుకోకుండా అతిధిగా వచ్చిన ఉదయ్ కిరణ్ అతిధి లాగానే వెళ్ళిపోయారు. కారణాలు ఏవైనా ఉదయ్ కిరణ్ లేని లోటు తీర్చలేనిది. చిత్రం సినిమాతో నటుడిగా కెరీర్ ను మొదలుపెట్టిన ఉదయ్ కిరణ్ తొలి సినిమాతోనే భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. 2000 సంవత్సరంలో ప్రారంభమైన ఉదయ్ కిరణ్ సినిమా కెరియర్ 2014 వరకు కొనసాగింది. మరి ఉదయ్ కిరణ్ నటించిన హిట్, ఫ్లాప్ సినిమాల గురించి ఒకసారి తెలుసుకుందాం..
Advertisement
Read also: UNSTOPPABLE SEASON 2 కి పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత వచ్చే 10 గెస్ట్ లు వీరే ..!
జూన్ 17, 2000 సంవత్సరంలో తేజ దర్శకత్వంలో వచ్చిన ” చిత్రం” అనే సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఉదయ్ కిరణ్ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని నమోదు చేశాడు. 26 లక్షలతో విడుదలైన ఈ సినిమా 35 లక్షల వరకు వసూలు చేసింది.
ఇక తర్వాత మరోసారి తేజ దర్శకత్వం లోనే ఆగస్టు 10, 2021 వ సంవత్సరంలో “నువ్వు నేను” బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 45 లక్షలతో నిర్మించిన ఈ సినిమా 65 లక్షలు వసూలు చేసింది.
అక్టోబర్ 19, 2021లో ఆదిత్య దర్శపత్వంలో తెరకెక్కిన చిత్రం ” మనసంతా నువ్వే”. ఈ సినిమాతో హ్యాట్రిక్ హీరో అయిపోయాడు ఉదయ్ కిరణ్. 65 లక్షలతో నిర్మించిన ఈ చిత్రం ఒకటిన్నర కోట్లకి పైగా వసూళ్లను సాధించింది.
Advertisement
ఇక తర్వాత వరుస పెట్టి ప్రేమ కథా చిత్రాలను ఎంచుకున్నాడు ఉదయ్ కిరణ్. 2002లో కలుసుకోవాలని, శ్రీరామ్, హోలీ, నీ స్నేహం వంటి చిత్రాలతో అలరించాడు. ఇందులో హోలీ, శ్రీరామ్ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.
ఇక మార్చి 17, 2003లో “జోడి నెంబర్ 1” ఇంకా వచ్చిన ఈ సినిమా భారీ ఫ్లాప్ నీ మూటకట్టుకుంది. 32 లక్షలు పెట్టి తీసిన ఈ సినిమా కేవలం 22 లక్షలను మాత్రమే రాబట్టింది.
ఆ తర్వాత రాజశేఖర్ దర్శకత్వంలో “నీకు నేను నాకు నువ్వు” అంటూ వచ్చిన ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. ఆ తర్వాత అర్పుదన్ దర్శకత్వంలో వచ్చిన “లవ్ టుడే” చిత్రం ఫ్లాప్ గా నిలిచింది.
ఇక ఏప్రిల్ 6, 2005లో మరోసారి తేజ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ” ఔనన్నా కాదన్నా”. ఈ చిత్రం కూడా యావరేజ్ గా నిలిచింది.
ఆ తర్వాత కే బాలచందర్ దర్శకత్వంలో “పోయి”, ఈ సత్తిబాబు దర్శకత్వంలో “వియ్యాలవారి కయ్యాలు”, మదన్ దర్శకత్వంలో “గుండె ఝల్లుమంది”, కే రామకృష్ణ దర్శకత్వంలో “ఏకలవ్యుడు”, శుభ సెల్వం దర్శకత్వంలో ” నువ్వెక్కడుంటే నేనక్కడుంటా”, శ్రీ దర్శకత్వంలో “దిల్ కబాడీ”, వి.ఎన్ ఆదిత్య దర్శకత్వంలో ” ఈ పెద్దోళ్ళున్నారే”, బాలాజీ ఎన్ సాయి దర్శకత్వంలో ” జైశ్రీరామ్”, మోహన్ దర్శకత్వంలో “చిత్రం చెప్పిన కథ”(విడుదల కాలేదు) వంటి చిత్రాలు తెరకెక్కాయి. ఈ చిత్రాలన్నీ ఫ్లాప్ గా నిలిచాయి.