Advertisement
తెలుగింటి అన్నగారు ఎన్టీఆర్ నటనా వైభవం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎన్నో పాత్రలను అవలీలగా పోషించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన నటుడు ఎన్టీఆర్. ఆయన సినిమాల్లో రాణించాక టాప్ పొజిషన్ లో ఉన్న సమయంలోనే రాజకీయాల వైపుకు వెళ్లిపోయారు. తెలుగు దేశం పార్టీని స్థాపించి ప్రజా సంక్షేమం కోసం కృషి చేసారు. సినీ రంగంలో ఆయన తరువాత ఆ లెగసీని బాలకృష్ణ కొనసాగించారు. ఆ తరువాత మూడవ తరం వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ తన సత్తా చాటారు.
Advertisement
ఇవి చదవండి : తిరుమల ఆలయం ముందు టిడిపి జెండా.. వైరల్ అవుతున్న ఫోటోలు!
అయితే.. జూనియర్ ఎన్టీఆర్ కు, చంద్రబాబు నాయుడుకు, బాలకృష్ణకు మధ్య వివాదాలు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పటికీ ఎన్టీఆర్ వెళ్లి పరామర్శించకపోవడంతో ఈ గొడవలు ఇంకా కొనసాగుతున్నాయని తెలుస్తోంది. అసలు ఈ గొడవలన్నింటికీ అసలు కారణం 2019 లో జరిగింది. 2019 ఎన్నికల సమయంలో తెలుగు దేశం పార్టీ తరపున ప్రచారానికి రావాలని చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ కోరారు. అయితే ఎన్టీఆర్ ప్రచారానికి రాకపోవడంతో వారు ఆగ్రహించినట్లు తెలుస్తోంది.
Advertisement
ఇవి చదవండి : నిజంగా ప్రేమిస్తే, వారికోసం ఆడవాళ్లు ఈ పనులన్నీ చేస్తారట.. అవేంటో చూడండి!
ఇది ఇలా ఉంటె.. రీసెంట్ గా జరిగిన సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు కూడా
జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాలేదు. కొంతమంది ఆయనను ఆహ్వానించని కారణంగా వెళ్లలేదని భావిస్తుంటే..మరికొందరు ఆయనను హరికృష్ణ సోదరుడు రామకృష్ణ వచ్చి ఆహ్వానించినప్పటికీ వెళ్లలేదని వాదిస్తున్నారు. దీనితో వీరి మధ్య గొడవ మరింత పెద్దది అయినట్లు ఉంది. అసలు దీనికంతటికీ కారణం కొడాలి నాని అని కొందరు వాదిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కొడాలి నాని చెప్పినట్లే చేస్తున్నారని.. అందుకే నందమూరి ఫ్యామిలీలతో గొడవలు ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు.
ఇవి చదవండి :లోకేష్ బాబు అరెస్ట్ కి CID రంగం సిద్ధం ? ఇవాళా ? లేదు రేపటికి ?