Advertisement
చాలామందికి తిరుమలలో ప్రసాదం అంటే గుర్తొచ్చేది లడ్డు మాత్రమే. వెంకటేశ్వర స్వామికి బాగా ఇష్టమైన లడ్డుతో పాటు ఎన్నో రకాల పదార్థాలను ఉపయోగించి నైవేద్యంగా సమర్పించడం ఒక ఆనవాయితీ అని చెప్పవచ్చు.1933లో తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పడిన తర్వాత నుండి ఎంతో నిష్టగా స్వామివారికి త్రికాల నైవేద్యం చేస్తున్నారు. నైవేద్యాలు పెట్టే సమయాలను మూడు భాగాలుగా విభజించి వాటిని మొదటి గంట, రెండో గంట, మూడో గంట అని పిలుస్తారు. ఆది, సోమ, మంగళ, బుధ, శని వారాల్లో స్వామివారికి సమర్పించే నైవేద్య సమయాలు ఒకే విధంగా ఉంటాయి. అయితే గురు శుక్ర వారాల్లో మాత్రం రెండో గంటలో నైవేద్యం సమర్పిస్తారు.
Advertisement
స్వామివారికి 5:30 కు తొలి నివేదన ఉంటుంది, రెండో గంట ఉదయం 10 గంటలకు మరియు మూడో గంట రాత్రి 7:30 గంటలకు ఉంటుంది. గురు శుక్రవారాల్లో రెండో గంట ఉదయం 7:30 నిమిషాలకు సమర్పిస్తారు. ప్రతిరోజు ఉదయం 5:30 గంటలకు చక్ర పొంగలి, కదంబం, పులిహోర, దద్దోజనం వంటివి సమర్పించి దీంతో పాటుగా లడ్డూలు, వడలు సమర్పిస్తారు.
Advertisement
Also read:
రెండో గంటలో చక్ర పొంగలి, పులిహోర, పెరుగన్నం, మిర్యాల పొంగలి, సీర, సేకరబాద్ నైవేద్యంగా పెడతారు. మూడో గంటలో అయితే కదంబం, తోమాల దోసలు, వడలు నివేదిస్తారు. ఆదివారం ప్రత్యేకంగా ఉంటుంది. గరుడ ప్రసాదంగా ప్రసిద్ధి చెందిన పిండిని సమర్పిస్తారు. సోమవారం విశేష పూజ సందర్భంగా ఎక్కువ ప్రసాదాలు ఉంటాయి. బుధవారం ప్రత్యేకంగా పాయసం, పెసరపప్పు ఉంటుంది. గురువారం జిలేబి, మురుకు పాయసము పెడతారు. అయితే అభిషేక సేవలు జరిగినప్పుడు ప్రత్యేకంగా పోళీలు ఉంటాయి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!