Ads
మన టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు ఉన్న ప్రతిభ అంతా ఇంతా కాదు. ఎన్నో భారీ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది చిత్ర పరిశ్రమ. ఇందులో లవ్, యాక్షన్ మరియు క్రైమ్ ఇతర సినిమాలు కూడా ఉన్నాయి. అయితే… ఈ సినిమాల్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా నటించిన వారు.. ఇప్పుడు ఆంటీలు, నానమ్మ, అమ్మమ్మలు అయ్యారు. అయితే.. అలాంటి వారు.. ఇప్పుడు, అలాగే అప్పుడు ఎలా ఉన్నారో ఓ లుక్కేయండి.
Also Read: Pakka Commercial Review: పక్కా కమర్షియల్ రివ్యూ
#1 జయసుధ
జయసుధ సహజ నటిగా పేరు పొందారు. ఈమె అసలు పేరు సుజాత. పుట్టి పెరిగినది మద్రాస్ లో అయినా మాతృభాష తెలుగే. జయసుధ నటించిన 300కు పైగా సినిమాల్లో 20 తమిళ సినిమాలు, 8 మలయాళ సినిమాలు, మూడు హిందీ సినిమాలు, ఒక కన్నడ సినిమాలు ఉన్నాయి.
#2 శోభన
విలక్షణ నటి ప్రముఖ నృత్యాకారిణి శోభన తమిళ, తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ చిత్ర రంగాలకు సుపరిచితులు. సినీ పరిశ్రమలో చాలా సీనియర్ నటి. ఆమె వయస్సు దాదాపు 47 సంవత్సరాలు.
#3 మీనా
దక్షిణ భారత సినిమాల్లో అత్యంత విజయవంతమైన నటీమణులలో మీనా దురైరాజ్ ఒకరు. మీనా సెప్టెంబర్ 16,1977న చెన్నైలో జన్మించింది. ఆమె ఎనిమిదవ తరగతి చదువుతున్నప్పుడు 13 సంవత్సరాల వయస్సులోనే హీరోయిన్ అయ్యారు.
#4 శ్రీదేవి కపూర్
శ్రీదేవి ప్రముఖ భారతీయ నటి. వందలాది హిందీ, తమిళం, తెలుగు, మలయాళం భాష చిత్రాల్లో నటించింది. ఆమె నాలుగేళ్ల వయస్సులో నటించడం ప్రారంభించింది. నటన మున్నగు వాటిలో శ్రీదేవి అగ్రశ్రేణి కథానాయకగా గుర్తింపు సంపాదించింది.
Advertisement
#5 సుహాసిని
సుహాసిని ప్రముఖ దక్షిణ భారత నటి. ప్రముఖ దర్శకుడు మణిరత్నం ను వివాహమాడింది. తమిళనాడులో గల చెన్నై పట్టణంలో జన్మించింది.
#6రమ్య కృష్ణన్
రమ్యకృష్ణ ఒక భారతీయ సినీ నటి. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ ఈమె భర్త. యుక్త వయస్సులోనే సినిమా రంగంలోకి అడుగు పెట్టింది.
#7 విజయశాంతి
విజయశాంతి జూన్ 24, 1966న వరంగల్లో జన్మించి మద్రాస్ లో పెరిగింది. విజయశాంతి పిన్ని విజయ లలిత కూడా అలనాటి తెలుగు సినిమా నటి. విజయశాంతి అసలు పేరు శాంతి. విజయ శాంతి తన ఏడవ సంవత్సరంలోనే తన సినీ రంగం మొదలైంది.
#8 జయప్రద
జయప్రద సినిమా నటి, రాజకీయవేత్త. 1962 ఏప్రిల్ 3న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రిలో ఒక మధ్య తరగతి కుటుంబంలో కృష్ణ మరియు నీలవేణి దంపతులకు జన్మించింది.
Also Read: మీనా భర్త విద్యాసాగర్ ఆస్తుల విలువ ఎన్ని కోట్లో తెలిస్తే షాకవుతారు..?