Advertisement
టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు ఉన్న ప్రతిభ అంతా ఇంతా కాదు. ఎన్నో భారీ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది చిత్ర పరిశ్రమ. ఇందులో లవ్, యాక్షన్ మరియు క్రైమ్ ఇతర సినిమాలు కూడా ఉన్నాయి. అయితే 1932 నుంచి ఇప్పటి వరకు హిట్ అయిన మూవీ లు చాలానే ఉన్నాయి. అందులో ఇండస్ట్రీ హిట్ అయిన సినిమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
Advertisement
Also Read: స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ల రెమ్యూనిరేషన్స్ ఎలా ఉన్నాయంటే ..!
భక్త ప్రహ్లాద
మొదటి తెలుగు టాకీ సినిమా ఇది. ఇక్కడి నుంచి సినిమా పరిశ్రమ సంచలనాలు మొదలయ్యాయి. అప్పట్లో దీని షేర్ 50000.1932 లో వచ్చింది ఈ సినిమా.
సావిత్రి
1933 లో వచ్చిన సావిత్రి సినిమా లక్ష రూపాయల షేర్ వసూలు చేసింది.
లవకుశ
1934లో వచ్చిన సినిమా ఐదు లక్షలు వసూలు చేసి షాక్ కి గురి చేసింది.
మాలపిల్ల
1938 లో వచ్చిన ఈ సినిమా పది లక్షల వరకు వసూలు చేసింది. హరిజన ఆడపిల్ల గురించి తీసిన సినిమా ఇది.
భక్త పోతన
1942లో వచ్చిన ఈ సినిమా 20 లక్షలు వసూలు చేసింది. బయోగ్రఫీ అంటే ఇలా ఉండాలి అన్నట్టు ఈ సినిమాను తెరకెక్కించారు.
త్యాగయ్య
1946 లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో 25 లక్షలు వసూలు చేసింది. చితూరు నాగయ్య ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమాకు ఆస్కార్ వచ్చే రేంజ్ ఉంది అంటారు.
గుణసుందరి కథ
1949లో వచ్చిన ఈ సినిమా నలభై లక్షలు వసూలు చేసింది.
పాతాళ భైరవి
మొత్తం 50 లక్షలు వసూలు చేసి ఎన్ టి ఆర్ ఇండస్ట్రీ హిట్ ఇచ్చింది ఈ సినిమా.
దేవదాసు
ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. 1953లో వచ్చిన ఈ సినిమా 55 లక్షలు వసూలు చేసి అక్కినేనికి రెండో హిట్ ఇచ్చింది.
రోజులు మారాయి
Advertisement
1955 లో వచ్చిన ఈ సినిమా ఏకంగా 60 లక్షల రూపాయలు వసూలు చేసింది. భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ ఎలా ఉండాలో చెప్పింది ఈ సినిమా.
మాయాబజార్
ఈ సినిమా ఇప్పుడు టీవీలో వచ్చిన చూస్తున్నారు అభిమానులు. 1963 లోనే కోటి రూపాయల వరకు వసూలు చేసింది ఈ సినిమా.
దసరా బుల్లోడు
అక్కినేనికి ఈ సినిమా తిరుగులేని విజయం ఇచ్చింది. 1971లో వచ్చిన ఈ సినిమా కోటిన్నర వసూలు చేసింది.
అల్లూరి సీతారామరాజు
తెలుగు సినిమా లో ఈ సినిమా ఒక సంచలనం అనే చెప్పాలి. 1974 లో వచ్చిన ఈ సినిమా రెండు కోట్ల రూపాయలు వసూలు చేసింది.
అడవి రాముడు
1977లో వచ్చిన ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక్కడి నుంచి సినిమా రూట్ మారిపోయింది. ఎన్టీఆర్ కు తిరుగులేని హిట్ ఇచ్చింది.
ప్రేమాభిషేకం
1981 లో వచ్చిన ఈ సినిమా అక్కినేని కెరీర్లో మైలురాయిగా నిలిచింది అనే చెప్పాలి. 4.5 కోట్లు అసలు చేసి సంచలనం సృష్టించింది.
పసివాడి ప్రాణం
చిరంజీవి, విజయశాంతి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా దాదాపు ఐదు కోట్లు వసూలు చేసింది.
యముడికి మొగుడు
1988లో వచ్చిన ఈ సినిమా మొత్తం ఐదు కోట్ల రూపాయలు వసూలు చేసింది.
శివ
నాగార్జున కు సూపర్ హిట్ ఇచ్చి కెరిర్ లో మర్చిపోలేని జ్ఞాపకాలు ఇచ్చింది. అప్పట్లో ఈ సినిమా 5.6 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
చూసుకుంటూ పోతే జగదేకవీరుడు అతిలోకసుందరి, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, పేదరాయుడు, సమరసింహా రెడ్డి, నువ్వే కావాలి, నరసింహ నాయుడు, ఇంద్ర, పోకిరి, మగధీర వంటి సినిమాలు చరిత్ర సృష్టించాయి. ఇక అత్తారింటికి దారేది, ఆ తర్వాత వచ్చిన బాహుబలి 2 భాగాల గురించి ఎంత చెప్పినా తక్కువే.
ALSO READ : అసలు అగ్నిపథ్ స్కీం ఏంటి ? దేశవ్యాప్తంగా ఎందుకు దాన్ని యువత వ్యతిరేకిస్తుంది ?