Advertisement
టాలీవుడ్ లో రీమేక్ సినిమాలు ఎక్కువ అవుతున్నాయి. అలాగే మన తెలుగు సినిమాలను కూడా బాలీవుడ్ వాళ్లు రీమేక్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. నిజానికి ఓ సినిమాని రీమేక్ చేయడం అనేది చాలా సేఫ్ గేమ్ అని అంతా అనుకుంటూ ఉంటారు. కానీ ఓ హిట్టు సినిమాని రీమేక్ చేయడం అనేది అంత ఈజీ ఏమీ కాదు. రాష్ట్రానికి తగినట్టు ప్రజల అభిరుచి వేరుగా ఉంటుంది. యాజ్ ఇట్ ఈజ్ గా దింపేస్తే మొదటికే మోసం వస్తుంది.
Advertisement
అయితే ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఎక్కువ రీమేక్ సినిమాలో నటించిన హీరో ఎవరు. ఎన్ని రీమేక్ సినిమాల్లో నటించాడు. వాటి పేర్లు ఏంటి అనే దానిపై ఓ లుక్కేద్దాం రండి. తెలుగులో ఇప్పటివరకు రీమేక్ సినిమాలు ఎక్కువగా చేసిన హీరోల విషయానికి వస్తే అందరికంటే ఎక్కువగా సీనియర్ ఎన్టీఆర్ సుమారు 52 సినిమాలు తన కెరీర్ మొత్తం మీద చేశారు.
ఆయన ఆ తర్వాత స్థానాన్ని అక్కినేని నాగేశ్వరరావు తెలుగులో ఎక్కువ రీమేక్ సినిమాలు చేశారు. సుమారు ఆయన 42 రీమేక్ సినిమాలు చేశారు. తర్వాత కృష్ణంరాజు తన కెరీర్ లో 25 రీమేక్ సినిమాలు చేశారు. వెంకటేష్ తన కెరీర్ లో 25 రీమేక్ సినిమాలు చేశారు.
Advertisement
మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో మొత్తం మీద 17 రీమేక్ సినిమాలు చేశారు. ఆయన ఈ మధ్యకాలంలో మరిన్ని రీమేక్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది. బాలకృష్ణ కెరియర్ లో 12 రీమేక్ సినిమాలు చేశారు. ఇక నాగార్జున కూడా తన కెరీర్ లో 12 రీమేక్ సినిమాలు చేశారు.
సూపర్ స్టార్ కృష్ణ తన కెరీర్ లో 11 రీమేక్ సినిమాలు చేశారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో పది రీమేక్ సినిమాలు చేశారు. ఇక ఆ తర్వాత రవితేజ తన కెరీర్ లో ఐదు రీమేక్ సినిమాలు చేస్తే సుమంత్ కూడా ఐదు రీమేక్ సినిమాలు చేశారు.
తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ కూడా తన కెరీర్ లో నాలుగు రీమేక్ సినిమాలు చేశారు. నిఖిల్ సిద్ధార్థ్ 3, కళ్యాణ్ రామ్ 3, నాని 2, రామ్ చరణ్ 2, శర్వానంద్ 2, నాగచైతన్య 2, ప్రభాస్ 2, రామ్ పొతినేని 2, రానా దగ్గుబాటి 2, నితిన్ 2, జూనియర్ ఎన్టీఆర్ 1, అడవి శేషు 1 రీమేక్ సినిమాల్లో నటించారు.
READ ALSO : పంచముఖ ఆంజనేయ స్వామిని పూజిస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసా ?