Advertisement
Tollywood heroes: తెలుగులో టాప్ హీరోలు అనగానే మనకి గుర్తుచే పేర్లు ఎన్టీఆర్, కృష్ణ, మెగాస్టార్. ఇంకా చాలామంది హీరోలు ఉన్నారు కానీ ఈ ముగ్గురు కూడా కాస్త వెరైటీ పాత్రలు చేశారు. అదేంటంటే తెలుగు హీరోలలో ఈ ముగ్గురు మాత్రమే టార్జాన్ పాత్రలు చేశారు. ఎన్టీ రామారావు తన కెరియర్లో 300 కి పైగా సినిమాల్లో నటించారు. కృష్ణ అయితే 350 కి పైగా సినిమాల్లో నటించారు. చిరంజీవి విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి 150 కి పైగా సినిమాల్లో నటించారు. వీళ్ళు ముగ్గురు కూడా నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు ఎంతోమంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. మొదట టార్జాన్ గా నటించినది కృష్ణ. 1967 మార్చి 3న రిలీజ్ అయిన ఇద్దరు మొనగాళ్లు సినిమాలో కృష్ణ టార్జాన్ పాత్ర పోషించారు.
Advertisement
బి విఠలాచార్య దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది. కాంతారావు కృష్ణ అన్నదమ్ములుగా ఈ సినిమాలో నటించారు. కాంతారావు సరసన కృష్ణకుమారి, కృష్ణ సరసన సంధ్యారాణి ఈ సినిమాలో కనిపించి మెప్పించారు. కృష్ణ నటించిన మొట్టమొదట జానపద మూవీ ఇది ఈ సినిమాలో కృష్ణ మంచి ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. గూఢచారి 116 మూవీ తర్వాత ఈ సినిమాని చేసారు. ఫస్ట్ హాఫ్ మొత్తం కృష్ణకి ఒక డైలాగ్ కూడా ఉండదు. అయినా కూడా ఈ మూవీ పెద్ద హిట్ అయింది. 1978 జూలై 28న రాజపుత్ర రహస్యం సినిమా వచ్చింది ఎన్టీరామారావు ఈ సినిమాలో టార్జాన్ గా నటించారు. జయప్రద హీరోయిన్ గా నటించారు జానపద చిత్రంగానే రూపొందింది. ఈ మూవీలో మొదట 30 నిమిషాలు హీరో కనిపించరు.
Advertisement
Also read:
- Vastu Tips: వంటగదిలో ఈ మార్పులు చేసారంటే.. ఎప్పుడు లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుంది..!
- Salim Baig : ఘర్షణ సినిమాలో నటించిన ఈ నటుడు.. ఇప్పుడు ఎలా ఉన్నాడో చూస్తే షాక్ అయ్యిపోతారు..!
- Shriya Sharma: జై చిరంజీవ లో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా ఉందో తెలుసా ? తాను ఏ లెవెల్లో ఉందొ చూస్తే హ్యాట్సాఫ్ అంటారు
ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా ఫస్ట్ హాఫ్ అంతా ఒక డైలాగ్ కూడా ఉండదు అయినా కూడా సినిమా పెద్ద హిట్ అయింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా 1985 సెప్టెంబర్ 19న అడవి దొంగ మూవీ వచ్చింది. చిరంజీవి హీరో అయిన తర్వాత కే రాఘవేంద్రరావు కాంబినేషన్లో రూపొందిన మొదటి సినిమా ఇది. ఇందులో రాధ హీరోయిన్ గా నటించారు చిరంజీవి టార్జాన్ గా నటించారు ఇలా ఈ మూడు సినిమాల్లో చూసుకున్నట్లయితే ఈ హీరోలు ఫస్ట్ హాఫ్ అంతా కూడా అసలు మాట్లాడకుండానే హిట్ కొట్టేశారు.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!