Advertisement
త్రివిక్రమ్, మహేష్ బాబు, శ్రీలీల కాంబోలో వచ్చిన సినిమా గుంటూరు కారం. సంక్రాంతి సందర్భంగా విడుదల అయిన ఈ సినిమా థియేటర్లలో అరుపులు పెట్టిస్తోంది. విభిన్నమైన చిత్రాలను ఎంచుకుంటూ.. బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతూ మహేష్ బాబు దూసుకెళ్ళిపోతున్నాడు. గత చిత్రంతో కొంత నిరాశ ఎదురవడంతో.. ఈ సారి మాత్రం దూసుకెళ్లాలని అనుకున్నాడు. అలాగే గుంటూరు కారం సినిమాతో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా భారీగానే కలెక్షన్స్ రాబోతోంది.
Advertisement
పక్కా కమర్షియల్ మూవీగా రూపొందిన గుంటూరు కారం సినిమా జనవరి పన్నెండున థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. మూడు వేలకు పైగా థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. అయితే.. గుంటూరు కారం సినిమాలో ఓ అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ పార్టీ పేరుని జనదళం (JDP) గా త్రివిక్రమ్ చూపించారు. ఈ అంశం ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
Advertisement
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ గానే త్రివిక్రమ్ ఈ పార్టీ పెట్టాడు అంటూ చర్చ జరుగుతోంది. ఈ సినిమాలోని పార్టీ పేరుని టీడీపీ లో నుంచి DP ని, జనసేన లోని J ని కలిపి JDP పార్టీగా పెట్టారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ సినిమా ద్వారా ఇన్ డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ కు, చంద్రబాబు నాయుడు త్రివిక్రమ్ సపోర్ట్ చేస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీనితో ఈ అంశం ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది.
Read More: