Advertisement
ఇష్టమైన స్టార్ ని అభిమానిగానే ఎంతో గొప్ప స్థాయిలో ఊహించుకుంటాము. అలా ఊహించుకునే అభిమానే డైరెక్టర్ గా మారి తమ అభిమాన హీరోలతో సినిమాలు తీస్తే ఏ విధంగా ఉంటుందో ఊహించుకోండి. ఒక రేంజ్ లో సక్సెస్ అవుతుందని చెప్పవచ్చు. అలనాడు రజినీకాంత్ రోబో సినిమాతో మొదలు ఇప్పటి కమలహాసన్ విక్రమ్ చిత్రం వరకు ఎలాంటి విజయం సాధించిందో రుజువు అయ్యింది. కేవలం ఈ రెండు చిత్రాలే కాదు, ఇంకా ఎన్నో చిత్రాలు తమ అభిమాన హీరోల చిత్రాలకు దర్శకత్వం వహించి సక్సెస్ సాధించారు డైరెక్టర్స్.
Advertisement
Read Also : ఉదయ్ కిరణ్ తో మల్టీస్టారర్ మూవీ..నో చెప్పిన తరుణ్.. ఆ సినిమా ఏంటంటే..?
#1 లోకేష్ కనగరాజ్
కమల్ హాసన్, లోకేష్ లైఫ్ లో ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పవచ్చు. లోకేష్ కమలహాసన్ ని చూసి నేను చాలా విషయాలు నేర్చుకున్నానని అనేక ఇంటర్వ్యూలో వెల్లడించారు. విక్రమ్ చిత్రంతో కమల్ హాసన్ ఒక మాస్ లుక్ లో చూపించాడు లోకేష్.
#2 డైరెక్టర్ అట్లీ కుమార్
మురుగదాస్ తర్వాత విజయాన్ని పూర్తి మాస్ క్యారెక్టర్ లో చూపించిన దర్శకుడు అట్లీ. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. అట్లీ కూడా విజయ్ కి వీరాభిమాని.
#3 డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు
Advertisement
కార్తీక్ చిన్నతనము నుంచి రజినీకాంత్ కు పెద్ద అభిమాని. పేట చిత్రంగాను రజినీకాంత్ కథానాయకుడిగా దర్శకత్వం వహించారు.
#4 హరీష్ శంకర్
హరీష్ శంకర్ కాలేజీ డేస్ నుంచి పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని. ఒక హీరో ఏ విధంగా ఉండాలని అభిమాని కోరుకుంటాడు అదేవిధంగా గబ్బర్ సింగ్ సినిమాతో పవన్ కళ్యాణ్ ని చూపించాడు హరీష్ శంకర్. అప్పట్లో ఈ సినిమా సెన్సేషనల్ హిట్ గా నిలిచింది.
#5 బోయపాటి శ్రీను
బోయపాటి శ్రీను నందమూరి కుటుంబానికి వీరాభిమాని. ఒక అభిమాని తన హీరో ఏ విధంగా ఉండాలి అని ఆలోచిస్తూ క్రియేట్ చేసిన సింహా, లెజెండ్, అఖండ చిత్రాలు విజయం సాధించాయి. వీరిరువురి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తాయనే విషయం వేరే చెప్పాల్సిన అవసరం లేదు.
#6 డైరెక్టర్ శంకర్
డైరెక్టర్ శంకర్ తన మొదటి సినిమా నుంచి రజినీకాంత్ తో ఓ సినిమా చేయాలని ట్రై చేస్తూనే ఉన్నారు. కానీ రోబోతో ఆయన కల నెరవేరింది. ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ రికార్డులు బద్దలు కొట్టింది. శంకర్ ఏ చిత్ర కథను రాసుకున్న దానిలో రజనీకాంత్ హీరోగా ఊహించుకునే వాడిని అని ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.
Read Also : టాలీవుడ్ విలన్ రఘువరన్ కొడుకు, ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా ?