Advertisement
సినిమా ధియేటర్ కి వెళ్ళినప్పుడు టీవీలో మనకి వచ్చే అడ్వర్టైజ్మెంట్లలో పొగాకు, గుట్కా కి సంబంధించి యాడ్ ముఖ్యంగా ఉంటుంది. సినిమా థియేటర్ కి వెళ్లినప్పుడు సినిమాని ప్లే చేయడానికి ముందు ఎక్కువగా ఈ అడ్వర్టైజ్మెంట్ ని ప్లే చేస్తూ ఉంటారు. దాంతో ప్రతి ఒక్కరికి గుర్తుండిపోతుంది. కానీ అడ్వటైజ్మెంట్ ని చూడగానే సినిమాకి వచ్చిన ప్రేక్షకులు ఈ అడ్వర్టైస్మెంట్ ని సీరియస్ గా తీసుకోకుండా హేళన చేస్తూ ఉంటారు.
Advertisement
నా పేరు ముఖేష్, రెండు గాజులు అమ్ముకున్నాను, ఈ నగరానికి ఏమైంది ఇలాంటి అడ్వర్టైజ్మెంట్లు కనపడినప్పుడు సీరియస్ గా తీసుకోరు. చాలామంది తెలియని విషయమేంటంటే ఇలాంటి అడ్వటైజ్మెంట్ లు మనకి అవగాహనని కల్పిస్తాయి. కానీ చాలామంది ఇటువంటి అడ్వటైజ్మెంట్లను చూసి జోకులు వేసుకుంటూ ఉంటారు. ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు ఎగతాళి చేస్తూ ఉంటారు. ముఖేష్ అనగానే నవ్వుతూ ఉంటారు కానీ ఇప్పుడు కనుక మీరు దీన్ని చూశారంటే ఇకమీదట ఆ అడ్వర్టైజ్మెంట్లకి నవ్వరు. ఎంతో బాధపడతారు.
ఈ అడ్వర్టైజ్మెంట్లో కనపడే వాళ్ళు డబ్బులు కోసం ఈ యాడ్ ని చేయడం లేదు. వాళ్ళలా ఎవరూ బాధపడకూడదని వీటిని చేశారు. ప్రతి సంవత్సరం పొగాకు వలన 80 లక్షల మంది మరణిస్తున్నారు. 70 లక్షల మందికి పైగా పొగాకు తీసుకుని చనిపోతుంటే.. పది లక్షలు పొగాకు పీలుస్తున్న వాళ్ళ వలన ఇబ్బంది పడుతున్నారు. పొగాకు వలన బాధపడుతున్న వాళ్లలో ముఖేష్ ఒకరు. ముఖేష్ మహారాష్ట్ర కి చెందిన వ్యక్తి రోజు వారి కూలి కింద పనిచేసేవాడు. తన సంపాదనతోనే ఇల్లు గడిచేది. గుట్కా వ్యసనం వల్ల ఇబ్బంది పడ్డాడు. ఆరోగ్యం కూడా పాడైంది.
Advertisement
ఆరోగ్యం పాడైన గుట్కా అని తినడం మానలేదు నోటి క్యాన్సర్ వచ్చింది ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. అతను ఆసుపత్రిలో ఉన్నప్పుడు భారత ప్రభుత్వం అక్కడికి వెళ్లి యాడ్ ని షూట్ చేశారు. మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నపుడు అయినా కూడా గుట్కా వల్ల తాను పడిన బాధ గురించి వివరించాడు. డాక్టర్లు నోటి క్యాన్సర్ ఉందని ఓకల్ కార్డ్స్ ని తొలగించారు అయినా సరే ఎంతో ఇబ్బంది పడి 27 అక్టోబర్ 2009లో ముకేశ్ చనిపోయాడు. ఇంకో ఎడ్వర్టైజ్మెంట్లో సునీత అని ఒక ఆవిడ కనబడుతుంది.
సునీతకి 30 ఏళ్లు పిల్లలు కూడా ఉన్నారు. పొగాకు అలవాటు వల్ల క్యాన్సర్ వచ్చింది. 2013లో ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు తగ్గింది. కానీ మళ్ళీ 2015లో వచ్చింది. చనిపోయారు. పొగాకు వలన నా జీవితం ఇలా అయిపోతుందని ఊహించలేదని ఆమె ఒక లేఖ మోడీకి రాశారు. ఎవరి జీవితం తనలా కాకూడదని ఆమె ఆ లేఖలో వివరించారు. అయితే ఇలా అడ్వర్టైజ్మెంట్లో కనపడే వాళ్ళు నటులు కాదు వాళ్ళు కూడా బాధితులే.
Also read: