Advertisement
Ugadi Panchngam, Rashi Phalalu In Telugu 2023 – 2024: సాధారణంగా ఉగాది పండుగ రాగానే నూతన సంవత్సరంలో ఆదాయ వ్యయాలు, అనుకూల, ప్రతికూలతు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకోవాలని చాలా మందిలో ఆసక్తి ఉంటుంది. అలాంటి వారి కోసం ఏయే రాశులు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం.
Advertisement
శోభకృత్ ఉగాది పంచాంగం తెలుగు 2023 to 2024
మేషం :
ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1
ఈ రాశుల వారికి ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి. మంచి పనుల కోసం ధనాన్ని వెచ్చిస్తారు. పెట్టుబడులు మంచి లాాభాన్ని ఇస్తాయి. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో విశేషమైన పేరు ప్రతిష్టలు లభిస్తాయి. అదృష్టం కలిసొస్తుంది. విద్యార్థులు చాలా శ్రమించాల్సి వస్తుంది. ఉద్యోగంలో కోరుకున్న స్థాయికి చేరుకుంటారు. వ్యాపార రిత్యా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మొహమాటం వల్ల రుణ సమస్యలు రాకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఏప్రిల్ 22 నుంచి గురువు జన్మరాశిలో సంచరించడంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారు. శని ఏకాదశంలో సంపూర్ణ విజయాన్ని ప్రసాదిస్తున్నందువల్ల భూ గృహ యోగాలు ఉంటాయి. అక్టోబర్ 31 వరకు జన్మరాశిలో రాహువు నవంబర్ నుంచి ద్వాదశంలో ఇబ్బంది కలిగిస్తాడు. అక్టోవర్ 31 వరకు కేతువు వల్ల సప్తమంలో శ్రమ ఉంటుంది. నవంబర్ నుంచి కేతువు షష్టస్థానంో ఉండడంతో శీఘ్ర కార్యసిద్ధి లభిస్తుంది. దైవం మీకు అనుకూలంగా ఉంటుంది.
Ugadi Panchangam 2022 to 2023 telugu
వృషభం :
ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 6, అవమానం 1
ఈ రాశి వారికి విశేషమైన ఆదాయం ఉంది. పెట్టుబడి ప్రయత్నాలు ఫలిస్తాయి. 75 శాతం అదృష్టం ఉంటుంది. చేపట్టే పనుల్లో విజయం లభిస్తుంది. విద్యార్థులకు విశేషమైన విద్యాయోగం, ఉద్యోగులకు అధికార లాభముంటుంది. వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. విదేశాలలో అవకాశాలు పెరుగుతాయి. భూ, గృహ, వాహన యోగాలు ఉంటాయి. ఇంట్లో శుభకార్యక్రమాలు జరుగుతాయి. ఏప్రిల్ 22 తరువాత ద్వాదశకంలో గురువు సంచరించడం వల్ల ఆర్థిక నష్టాలు రాకుండా గురుశ్లోకం చదువుకోవాలి. శని దశమంలో ఉద్యోగపరమైన ఆటంకాలను కలిగించే అవకాశముంది. రాహువు ద్వాదశకంలో శ్రమ కలిగించినప్పటికీ నవంబర్ నుంచి శుభయోగాలుంటాయి. కేతువు అక్టోబర్ వరకు అనుకూల ఫలితాలను ఇస్తారు. నవంబర్ తరువాత సమస్యలు రాకుండా కేతు శ్లోకం చదువుకోవడం ఉత్తమం.
Ugadi rashi Phalalu 2023 – 2024
మిథునం :
ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 2, అవమానం 4
ఈ రాశి వారికి ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. కష్టపడి పని చేయాలి. 50 శాతం వరకు అదృష్టం ఉంటుంది. విద్యార్థులు రాణిస్తారు. ఉద్యోగంలో అధికారయోగముంటుంది. వ్యాపారంలో ఉన్నత స్థానానికి ఎదుగుతారు. గృహ భూ వాహన యోగాలు సిద్ధిస్తాయి. విదేశాలలో మంచి అవకాశాలు లభిస్తాయి. ఇంట్లో శుభాలు కలుగుతాయి. ఏప్రిల్ 22 వరకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఏప్రిల్ 23 నుంచి అదృష్టయోగముంటుంది. శని భాగ్య స్థానంలో ఉండడంతో శ్రమ ఎక్కువైనప్పటికీ శుభఫలితాలుంటాయి. లోతుగా ఆలోచించకూడదు. అక్టోబర్ 31 వరకు ఏకదశ స్థానంలో సంపూర్ణ శుభయోగాన్ని ఇస్తున్నాడు. నవంబర్ 01 నుంచి రాహువు దశమంలో కార్యసిద్ధి కలిగిస్తాడు. కేతు సంచారం వల్ల మానసిక సమస్యలు రాకుండా కేతు శ్లోకం చదువుకోవాలి.
కర్కాటకం :
ఆదాయం 11, వ్యయం 8, రాజపూజ్యం 5, అవమానం 4
ఆర్థిక పరిస్థితి గోచరిస్తుంది. అదృష్టయోగం 75 శాతం బాగుంటుంది. విద్యార్థులు రాణిస్తారు. వ్యాపారం చాలా బాగుంటుంది. పెట్టుబడి కూడా వృద్ధి చెందుతుంది. శని వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశముంది. ఏప్రిల్ 22 వరకు బృహస్పతి శుభ ఫలితాలను అందిస్తాడు. ఏప్రిల్ 23 నుంచి గురువు దశమంలో శ్రమతో కూడిన ఫలితాలను ఇస్తాడు. శని అష్టమంలో ఉన్నందున మానసిక ఒత్తిడి ఉంటుంది. శని శ్లోకం చదువుకోవాలి. అక్టోబర్ 31 వరకు దశమంలో కార్యసిద్ధిని ఇస్తాడు. నవంబర్ నుంచి విఘ్నాలు కలిగించే అవకాశముంది. అక్టోబర్ వరకు మిశ్రమంగా ఉన్న కేతువు నవంబర్ నుంచి దివ్యమైన శుభ ఫలితాలను అందిస్తారు.
సింహం :
ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 1, అవమానం 7
అద్భుతమైన ధనయోగం ఉంటుంది. 50 శాతం వరకు అదృష్టయోగం ఉంది. ఏప్రిల్ 22 తరువాత గురు బలం వల్ల విద్యార్థులు ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులవుతారు. ఉద్యోగంలో కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. వ్యాపారంలో పెట్టుబడులు పెరుగుతాయి. ఆస్తిని వృద్ధి చేస్తారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. గురు సంచారంతో ఏప్రిల్ 22 వరకు శ్రమ పెరుగుతుంది. ఏప్రిల్ 23 నుంచి అదృష్ట యోగం ఉంటుంది. శని సప్తమ రాశిలో ఉండడం వల్ల భాగస్వామితో గొడవలు ఏర్పడుతాయి. రాహువు అష్టమం, నవమిల్లో ఉండడం వల్ల ఈ ఏడాది అంతా యోగించడం లేదు. వివాదాలకు దూరంగా ఉండడం ఉత్తమం. కేతువు అక్టోబర్ 31 వరకు మూడో రాశిలో సంచరించడంతో శుభఫలితముంటుంది.
Also Read: Ugadi wishes 2023 Telugu
కన్య :
ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7
ఖర్చు విషయంలో జాగ్రత్త పడాలి. ఏప్రిల్ 22 వరకు గురు బలం వల్ల ఎదురుచూస్తున్న పనులలో మంచి జరుగుతుంది. విద్యాపరంగా శుభ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో పూర్వార్థం బాగుంటుంది. ఆ తరువాత గురుబలం లేనందున ఏకాగ్రతతో పని చేయాలి. పనులు వాయిదా వేయకూడదు. వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. గురువు సప్తమంలో ఉన్నంత కాలం శుభయోగాలు ఉంటాయి. ఏప్రిల్ 23 నుంచి ఆటంకాు ఎదురయ్యే అవకాశముంది. శని ఏడాది అంతా షష్ట స్థానంలో ఉన్నందువల్ల గొప్ప అదృష్టం కలుగుతుంది. అక్టోబర్ 31 తరువాత సప్తమ స్థానంలో ఆటంకాలను కలిగిస్తాడు రాహువు. ద్వితీయంలో కేతువు అక్టోబర్ 31 వరకు ఆ తరువాత జన్మకేతువు నిరాశ, వైరాగ్యం వంటి ఇబ్బందికరమైన ఫలితాతో ఉత్సాహాన్ని తగ్గించే అవకాశముంది.
Advertisement
తుల :
ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 7
ఈ రాశి వారు స్థిరాస్తుల కోసం ధనాన్ని వెచ్చిస్తారు. 50 శాతం వరకు అదృష్టయోగం ఉంటుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఉద్యోగంో మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో లాభాలను సొంతం చేసుకుంటారు. నూతన ప్రయత్నాలు సఫలం అవుతాయి. విదేశ ప్రయాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంట్లో అంతా మంచి జరుగుతుంది. ఏప్రిల్ 23 నుంచి గురువు వల్ల అదృష్టం లభిస్తుంది. కీర్తి ప్రతిష్టలుంటాయి. పంచమంలో ఉండడంతో ఆలోచనల్లో స్పష్టత లోపించకుండా శని శ్లోకం చదువుకోవాలి. అక్టోబర్ 31 వరకు సప్తమంలో ఇబ్బంది కలిగించవచ్చు. నవంబర్ నుంచి శుభయోగం ఉంటుంది. కేతువు జన్మరాశిలో అక్టోబర్ 31 వరకు ఉండి ఆ తరువాత ద్వాదశంలో ఉండడంతో ఉత్సాహం తగ్గే అవకాశముంది.
వృశ్చికం :
ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 3
ఈ రాశి వారు విశేషమైన కృషి చేయాలి. 75 శాతం అదృష్టం ఉంది. కాలం మీకు అనుకూలిస్తుంది. ఏప్రిల్ 22 వరకు విద్యార్థులు అద్భుతంగా రాణిస్తారు. ఉద్యోగంలో మంచి ఫలితాలుంటాయి. వ్యాపారంలో లాభాలు అధికంగా ఉంటాయి. మొహమాటం వల్ల ఖర్చులు పెరుగుతాయి. ఇంట్లో శాంతి లభిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఏప్రిల్ 22 వరకు గురువు పంచమంలో ఉత్తమ ఫలితాలను ఇస్తాడు. ఏప్రిల్ 23 తరువాత ఇబ్బందులను అధిగమించడానికి గురుశ్లోకం చదువుకోవాలి. తరువాత పంచమంలో ఆలోచనలలో స్పష్టత ఉండదు. నవంబర్ నుంచి కేతువు విశేషమైన శుభఫలితాలను ఇస్తాడు.
ధనుస్సు :
ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 6, అవమానం 3
ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. మీ ప్రతిభను గుర్తించి ఆదరించే వారు పెరుగుతారు. అదృష్ట యోగం 75 శాతం బాగుంటుంది. అనుకున్నది సాధిస్తారు. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఫలితాలు ఇప్పుడొస్తాయి. విద్యార్థులు ఉన్నత స్థాయిలో రాణిస్తారు. ఉద్యోగం అద్భుతంగా ఉంటుంది. అధికారయోగం ఉంటుంది. పెద్దలను మెప్పిస్తారు. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. విశేష ధన ధాన్య యోగాలు సూచితం. ఆర్థికాభివృద్ధి ఉంటుంది. విదేశ ప్రయాణ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. గృహ వాతావరణం ప్రశాంతతని ఇస్తుంది. గురువు చతుర్థంలో ఉండడంతో ఏప్రిల్ 22 వరకు మిశ్రమ ఫలితాలుంటాయి. ఏప్రిల్ 23 నుంచి పంచమంలో అద్భుతమైన అదృష్టం ఉంటుంది. రాహువు బంగారు భవిష్యత్ కి బాటలు వేస్తారు. రాహువు అక్టోబర్ 31 వరకు పంచమ స్థానంలో ఆ తరువాత చతుర్థ స్థానంలో ఇబ్బందికరమైన ఫలితాలుంటాయి. ప్రతిరోజూ రాహు శ్లోకం చదువుకుంటే విఘ్నాలు తొలగిపోతాయి. అక్టోబర్ 31 వరకు ఏకదశకంలో నవంబర్ నుంచి దశమంలో సంచరించడం వల్ల శుభ ఫలితాలుంటాయి. కేతువు విశేష ఫలితం లభిస్తుంది.
మకరం :
ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6
ఈ రాశికి స్థిరాస్తులు అభివృద్ధి చెందుతాయి. వివాదాలకు దూరంగా ఉండడం ఉత్తమం. పట్టుదలతో పని చేస్తే గ్రహ బలం సహకరిస్తుంది. విద్యార్థులకు మిశ్రమంగా ఉంటుంది. ప్రయత్న బలాన్ని రాణిస్తారు. ఉద్యోగంలో సకాలంలో పనులను విజయవంతంగా పూర్తి చేయాలి. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కుటుంబంలో ప్రేమానురాగాలతో నడుచుకోవాలి. ఏప్రిల్ 22 తరువాత అర్దాష్టమ బృహస్పతి యోగం ఇబ్బంది కలిగిస్తుంది. ఏలినాటి శని దోషం వల్ల తెలియని ఆటంకాలు ఏర్పడుతాయి. చతుర్థంలో అర్థాష్టమ రాహువు అక్టోబర్ 31 వరకు విఘ్నాలు కలిగిస్తాడు. నవంబర్ నుంచి శుభఫలితాలుంటాయి. దశమంలో కేతువు అక్టోబర్ 31 వరకు విజయాన్ని ప్రసాదిస్తాడు. ఆ తరువాత శ్రమ పెరుగుతుంది.
కుంభం :
ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6
ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి ధన లాభాలు ఉంటాయి. అదృష్ట చరాస్తులు వృద్ధి చెందుతాయి. పనులను వాయిదా వేయకుండా లక్ష్యాలను చేరుకోవాలి. విద్యార్థులు శుభ ఫలితాలను పొందుతారు. ఉద్యోగంలో ఏప్రిల్ వరకు ఎదుగుదలకు అనుకూలంగా ఉంటారు. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు బంగారు భవిష్యత్ ని ప్రసాదిస్తాయి. వ్యాపారంలో పూర్వార్థంలో మంచి ఫలితాలుంటాయి. పెట్టుబడులు పెరుగుతాయి. ఇంట్లో శుభాలు కలుగుతాయి. గురువు ద్వితీయంలో బ్రహ్మాండమైన శుభఫలితాలను ఇస్తాడు. రాహువు తృతీయ స్థానంలో అక్టోబర్ 31 వరకు కార్యసిద్ధినిస్తాడు. నవంబర్ నుంచి ద్వితీయంలో ఉండడంతో కుటుంబ కలహాలు, ఆర్థిక నష్టాలు చోటు చేసుకోవచ్చు.
మీనం :
ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 2
భూ గృహ వాహనాది యోగాలను పొందే క్రమంలో రుణ సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలి. అదృష్ట యోగం 25 శాతం మాత్రమే ఉంటుంది. ప్రతీ అడుగు కూడా జాగ్రత్తగా వేయడం ఉత్తమం. గురుబలం కారణంగా విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగంలో ఏప్రిల్ నుంచి కలిసొస్తుంది. వ్యాపారంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. విదేశీ ప్రయాణాలు ఫలిస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. సమిష్టి నిర్ణయంతోనే ఇంట్లో శాంతి నెలకొంటుంది. ఏప్రిల్ 23 నుంచి ధన స్థానంలో గురువు ఉండి విశేషమైన కార్యసిద్ధినిస్తాడు. ఈ ఏడాది నుంచి ఏలినాటి శని మొదలవుతుంది. అక్టోబర్ 31 వరకు ద్వితీయంలో, ఆ తరువాత జన్మరాశిలో రాహువు శ్రమ కలిగిస్తాడు. కేతువు సప్తమ, అష్టమ స్థానాల్లో ఇబ్బంది కలిగించే అవకాశముంది.
Also Read: Weekly Horoscope Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు 19.03.2023 నుంచి 25.03.2023 వరకు