Advertisement
దివంగత వంగవీటి మోహన రంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. నర్సాపురం కి చెందిన యువతితో ఆయన పెళ్లి నిశ్చయం అయినట్టు తెలుస్తోంది. అయితే తన స్నేహితుడికి దగ్గరి బంధువుల అమ్మాయితో పెళ్లి నిశ్చయం అయినట్టు పేర్కొంటున్నారు. ఆగస్టు 19న అంటే మరో మూడు రోజుల్లోనే నరసాపురంలో ఎంగేజ్ మెంట్ జరుగనుంది. సెప్టెంబర్ 06న వంగవీటి రాధా పెళ్లి నిశ్చయమైంది.
Advertisement
ఇన్ని రోజులు పెళ్లి గురించి ఆలోచన చేయని రాధా మొత్తానికి తన మిత్రుడికి దగ్గర బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారు. వంగవీటి పెళ్లి వార్త తెలిసినప్పటి నుంచి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పొలిటికల్ ఫ్యామిలీలో ఉన్న వంగవీటి రాధ 40 ఏళ్లు దాటినా ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. చివరికీ ఇప్పుడు ఓ తోడు కోరుకుంటున్నాడు.
Advertisement
వంగవీటి రాధా 2004లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. అప్పటి నుంచి యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నప్పటికీ అసెంబ్లీలో మరోసారి అడుగుపెట్టేందుకు అదృష్టం కలిసి రాలేదు. ఎన్నికల ముందు పార్టీలు మారుతూ తాను రాజకీయంగా ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. ఈసారి విజయవాడ సెంట్రల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నాడు. అయితే ఏ పార్టీ నుంచి నిలబడుతారో ఎన్నికల వరకు తెలియకపోవచ్చు. ప్రస్తుతం ఆయన టీడీపీలో ఉన్నారు.
Also Read :