Advertisement
NT రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, SV రంగారావు, సావిత్రి మరియు జమున వంటి అగ్ర నటులు నటించిన తెలుగు సినిమా గుండమ్మ కథలో ప్రధాన పాత్రధారిగా మరియు ‘గయ్యాళి అత్త’గా ప్రసిద్ధి చెందిన తెలుగు నటి సూర్యకాంతం గురించి ప్రత్యేకంగా పరిచయం చెయ్యక్కర్లేదు. అక్టోబర్ 28 వ తేదీ ఆమె 99 వ జయంతి. సినిమాల్లో గయ్యాళిగా కనిపించే ఆమె నిజానికి ఓ ఇంట్రావర్ట్ అన్న సంగతి చాలా మందికి తెలియదు. అంతగా.. ఆమె తన నటనా ప్రతిభతో అభిమానులను సంపాదించుకున్నారు.
Advertisement
సూర్యకాంతం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో 700కి పైగా సినిమాల్లో నటించారు. సూర్యకాంతం ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలో 1924 అక్టోబర్ 28న జన్మించారు. 6 సంవత్సరాల వయస్సులో, ఆమె డ్యాన్స్ మరియు పాడటం నేర్చుకోవడం ప్రారంభించారు. సినిమాల్లో నటించాలనే ఆసక్తి ఉన్న ఆమె తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి తన అమ్మమ్మతో కలిసి చెన్నై వచ్చారు. 1946లో నారద నారది సినిమాలో ఆమె తొలిసారి నటించారు. ఇందులో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా చేసినందుకుగాను ఆమె తొలిసారి 75 రూపాయల పారితోషికాన్ని అందుకున్నారు. 1950లో వచ్చిన సంసారం చిత్రంలో నెగిటివ్ పాత్రను పోషించి చాలా ప్రశంసలను పొందారు. 1960లో విడుదలైన గుండమ్మ కథ ఆమెను స్టార్ నటిగా నిలబెట్టింది. ఒక్క టేక్ లో అద్భుతమైన డైలాగ్ డెలివరీ అందించడం ఆమె ప్రత్యేకత.
Advertisement
ఆమెకు మొత్తంగా పది భాషలు వచ్చు. ఆమె తన 50 సంవత్సరాల వయస్సులో ఫ్రెంచ్ మరియు ఇంగ్లీష్ పట్టుబట్టి నేర్చుకున్నారు. ఆమెకు బెంగాలీ అంటే కూడా ఎంతో ఇష్టమట. స్వతహాగానే ప్రతిభావంతురాలైన ఈమెకు ఇండస్ట్రీలో గొప్ప ఫాలోయింగ్ నే ఉంది. అయితే.. ప్రస్తుతం ఉన్న జెనరేషన్ నటుల్లో ఈమెను భర్తీ చేయగల నటి ఎవరు? అన్న ప్రశ్నకి వరలక్ష్మి శరత్ కుమార్ పేరు సమాధానంగా వినిపిస్తోంది. ఈమెకు, సూర్యకాంతానికి చాల సిమిలారిటీస్ ఉన్నాయని అంటున్నారు. సూర్యకాంతం లానే వరలక్ష్మి శరత్ కుమార్ కూడా అద్భుతమైన పెర్ఫార్మన్స్ చేస్తున్నారని.. ఆవిడ నటనకి ఈమె ఏమాత్రం తీసిపోరని కితాబిస్తున్నారు. ఈమెకు నేటి సూర్యకాంతం అన్న బిరుదుని కూడా ఇచ్చేస్తున్నారు.
మరిన్ని..
రూల్స్ ని బ్రేక్ చేసిన చంద్రబాబు నాయుడు.. బెయిల్ రద్దు చెయ్యాలి అంటూ..?
విచిత్రంగా పెళ్లి పెటాకులు మహోత్సవాలు.. దానికి పెట్టిన ఈ వింత పేరుని చూసారా?
చంద్రబాబు నాయుడుకు బెయిల్ రావడం వెనుక అసలేం జరిగింది? 28 రోజుల తరువాత మళ్ళీ జైలు కి వెళ్లాలా?