Advertisement
ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఒక ముఖ్యమైన ఘట్టం అనే చెప్పాలి. అలాంటి వేడుకను తమ ఆర్థిక స్థితికి తగినట్టుగానే వైభవంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. నేటితరం యువత పెళ్లిలో గతానికి భిన్నంగా కొత్తదనం ఉండాలని కోరుకుంటున్నారు. తమదైన మార్కుతో ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకోసం ప్రీ వెడ్డింగ్ షూట్ ల నుంచి మంగళ స్నానాలు, సంగీత్ ల వరకు అందరికంటే భిన్నంగా వెరైటీగా ఉండాలని కోరుకుంటారు. తమ క్రియేటివిటీని ఉపయోగించే ట్రెండ్ సెట్ చేస్తున్నారు.
Advertisement
ఇక పెళ్లిలో ఆహ్వాన పత్రికలది కూడా ప్రత్యేక స్థానం అనే చెప్పాలి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో జరిగే వేడుకకు శుభలేఖలు ముద్రించి వాటిని ఇచ్చి పిలవడం మన దగ్గర తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. అలాంటి శుభలేఖలను వెరైటీగా ప్రింట్ చేయిస్తున్నారు నేటితరం యువత. అదిరిపోయే ఐడియాలతో.. అందరికీ గుర్తుండి పోయేవిధంగా పెళ్లి పత్రికలను ప్రింట్ చేయిస్తున్నారు. కరీంనగర్ జిల్లా మల్యాలకు చెందిన ఓ యువకుడు కూడా అలాగే చేశాడు. పక్కా తెలంగాణ యాసలో కార్డు ప్రింట్ చేయించాడు. ఫోక్ సాంగ్స్ రైటర్, సింగర్ గా రాణిస్తున్న పొన్నం మహేష్ గౌడ్ అనే యువకుడు తన ఫోక్ సాంగ్స్ యూట్యూబ్ ఛానల్ పేరుని ఇంటిపేరుగా మార్చుకొని స్థానికంగా గుర్తింపు పొందాడు.
Advertisement
ఇటీవల అతడికి పెళ్లి నిశ్చయం కాగా.. ఇక తెలంగాణ భాష , యాస ఉట్టిపడేలా వినూత్నంగా తన వెడ్డింగ్ కార్డును ప్రింట్ చేయించాడు మహేష్ గౌడ్. పొన్నం వోల్ల లగ్గం పిలుపు అంటూ తన సృజనాత్మకతను ఉపయోగించి పెళ్లి ఆహ్వాన పత్రిక ముద్రించి పంచారు. తెలంగాణ యాసలో ఉన్న పెళ్లి పత్రిక చూసిన మహేష్ బంధువులు , మిత్రులు అతని క్రియేటివిటీకి ఫిదా అయిపోయారు.
ప్రస్తుతం మహేష్ వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. అయితే గతంలోనూ ఇలాంటి వెడ్డింగ్ కార్డులను పలువురు ప్రింట్ చేయించారు. మై విలేజ్ షో ద్వారా పాపులర్ అయిన అనిల్ తన పెళ్లి పత్రికను కూడా ఇలాగే ప్రింట్ చేయించాడు. కరోనా సమయంలో అతడు పెళ్లి చేసుకోగా.. అప్పట్లో ఆ కార్డు వైరల్ అయింది.
మరికొన్ని ముఖ్య వార్తలు :
పుట్ట పార్థి సాయిబాబా పైన ఎన్టీఆర్ కోర్టుకి ఎందుకు వెళ్లారు ?
మీరు లేని జీవితం నాకు వద్దు.. భర్త మరణించడంతో భార్య ఏం చేసిందంటే ?