Advertisement
విజయ్ ఆంటోనీ బిచ్చగాడు సినిమాతో టాలీవుడ్ లోనూ ఘనవిజయం సాధించాడు. ఈ సినిమా సక్సెస్ తో తెలుగులోను మార్కెట్ క్రియేట్ చేసుకున్న విజయ్, తర్వాత తను హీరోగా నటించిన ప్రతి సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తూ వస్తున్నాడు. ఇక ప్రస్తుతం హీరోగా బిజీగా ఉన్నాడు. విజయ్ తండ్రి మరణించే నాటికి ఆయనకు కేవలం ఏడు సంవత్సరాలు మాత్రమే ఉన్నాయి. తన చెల్లి వయసు నాలుగు సంవత్సరాలు మాత్రమే కాగా, ఆయన తల్లి ఉద్యోగం చేస్తూ పిల్లలను చదివించేది.
Advertisement
ఉద్యోగం కోసం వేరే ఊరికి వెళ్లాల్సి వచ్చిన పిల్లల చదువు దెబ్బతింటుందని ఉన్నచోటు నుండే దూర ప్రయాణం చేసేది. ఆంటోనీ లయోలా కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ లో చదువుకున్నాడు. ఆ తర్వాత సౌండ్ ఇంజనీర్ గా విద్యనభ్యసించాడు. తన తల్లి ఉద్యోగరీత్యా శిక్షణ తరగతులకు వెళ్లాల్సి వచ్చింది। దాంతో అంటోనీని హాస్టల్ లో చేర్పించి తనతో పాటు కూతురును తీసుకెళ్లింది. అంతే కాదు హాస్టల్ లో ఉన్నప్పుడు అనుకోకుండా రెండు రోజులు సెలవులు వచ్చాయని, అప్పుడు తన వార్డెన్ సలహా మేరకు శ్రీలంక శరణార్థుల శిబిరంలో తలదాచుకున్నానని విజయ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
Advertisement
ఆ సమయంలో తన వద్ద చిల్లి గవ్వ కూడా లేదని కేవలం అరటిపండు తింటూ జీవనం సాగించాను అంటూ తాను పడిన కష్టాల గురించి చెప్పుకొచ్చారు. సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ‘నాన్’ 2012 అనే సినిమాతో ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత నటించిన సలీం సినిమాతో విజయ్ ఆంటోనీకి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత వరుస ఆఫర్లను అందుకున్నాడు. అంతేకాకుండా విజయ్ వివాహం కూడా అప్పట్లో సంచలనం సృష్టించింది. ఫాతిమా అనే ఒక జర్నలిస్టు విజయ్ ని ఇంటర్వ్యూ చేయడానికి రాగా, ఆమెతో ప్రేమలో పడి 2006 లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి లారా అనే కూతురు కూడా ఉంది.
Read also: చార్మి మాత్రమే కాకుండా నిర్మాతలు అయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్టు!