Advertisement
Vyavastha Web Series Review in Telugu : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో “కుమారి 21ఎఫ్” సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైన హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాలో ఈ భామ నటన చూసి జనం ఫిదా అయిపోయారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు ఓటీటీలో గ్లామర్ కాకుండా పర్ఫామెన్స్ స్కోప్ ఉన్న పాత్రలు లభిస్తున్నాయి. అందుకు ఉదాహరణ ఇటీవల ఆమె నటించిన ఓదెల రైల్వే స్టేషన్. ఇప్పుడు తాజాగా “వ్యవస్థ” అనే సిరీస్ తో ప్రేక్షకుల ముందుకి వస్తుంది వచ్చింది హెబ్బా పటేల్.
Advertisement
Vyavastha Webseries Review in Telugu
ఓయ్ ఫేమ్ ఆనంద్ రంగ తెరకెక్కించిన ఈ వ్యవస్థ అనే వెబ్ సిరీస్ జీ 5 లో ఏప్రిల్ 28 నుండి స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రంలో కార్తీక్ రత్నం, సంపత్ రాజ్, హెబ్బా పటేల్, కామ్నా జట్మలాని ప్రధాన పాత్రధారులుగా యాక్ట్ చేశారు. క్రైమ్ థ్రిల్లర్ గా తెరికెక్కిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..
Read also: AGENT TELUGU MOVIE REVIEW అక్కినేని అఖిల్ “ఏజెంట్” మూవీ రివ్యూ & రేటింగ్
Advertisement
Vyavastha Web Series Story: కధ మరియు వివరణ:
ఈ సిరీస్ లో యామిని పాత్రలో నటించింది హెబ్బా పటేల్. సంపత్ రాజ్ (చక్రవర్తి) అనే పవర్ఫుల్ పాత్రలో నటించారు. చక్రవర్తి సిటీలోని లాయర్స్ అందరిని తన జూనియర్స్ గా నియమించుకుని వారిపై అజమాయిషి చలాయిస్తూ ఉంటాడు. అతను చెప్పిందే జరగాలని కోరుకునే వ్యక్తిగా సంపత్ రాజ్ కనిపిస్తారు. ఇక యువ నటుడు కార్తీక్ రత్నం ఈ సిరీస్ లో ఓ సిన్సియర్ జూనియర్ లాయర్ ( వంశీ ) పాత్రలో నటించారు. అతను నత్తి సమస్యతో బాధపడుతూ ఉంటాడు. దీనివల్ల తనని తాను తక్కువగా ఊహించుకుంటాడు. అయితే ఓ కేసులో ఇరుక్కున్న యామిని ( హెబ్బా పటేల్) ని కాపాడడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు వంశీ. ఇక గాయత్రి అనే పాత్రలో కామ్నా జట్మలాని కనిపించింది. అయితే కేసులో ఇరుక్కున్న యామిని ని వంశీ ఎలా కాపాడాడు..? చక్రవర్తి నుంచి ఎదురైన సమస్యలను అతడు ఎలా ఎదుర్కొన్నాడో తెలియాలంటే జి 5 ఓటిటిలో ప్రసారమవుతున్న ఈ వెబ్ సిరీస్ ని చూడాల్సిందే.
Vyavastha WebSeries Review
ఈ సినిమాలో హెబ్బా పటేల్ యామిని పాత్రలో అద్భుతమైన నటన కనబరిచారు. క్రై#$మ్ నేపథ్యంలో రూపొందిన కోర్టు రూమ్ డ్రామా కావడంతో ప్రేక్షకులు ఈ సిరీస్ మీద ఆసక్తి చూపించే అవకాశం ఉంది. ఇక కామ్నా జట్మలాని కూడా ఇందులో కనిపించడం విశేషం. అక్కడక్కడ సాగదీత సన్నివేశాలు, కథ కూడా ఇంతకుముందు చూసినట్లుగానే అనిపిస్తుంది. ఇక జూనియర్ లాయర్ వంశీ పాత్రలో నటించిన కార్తీక్ రత్నం, సంపత్ రాజ్ వారి నటనతో ఆకట్టుకున్నారు. మొత్తానికి ఈ సినిమా ఆకట్టుకునే విధంగా ఉంది.
ప్లస్ పాయింట్స్:
హెబ్బా పటేల్ నటన
కోర్ట్ సీన్స్
మైనస్ పాయింట్స్:
సాగదీత సన్నివేశాలు
కథ
రేటింగ్: 2/5