Advertisement
Weekly Horoscope in Telugu 2023: ఈ కాలంలో ప్రతి ఒక్కరూ ఈ వారం రాశి ఫలాలు చూసుకుంటున్నారు. అయితే, ఈ జ్యోతిష్యం ప్రకారం వ్యక్తులకు ప్రతి రోజూ ఎదురయ్యే పరిస్థితులను అంచనా వేయవచ్చు. గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా జ్యోతిష్య నిపుణులు భవిష్యత్తును అంచనా వేయగలరు. ఇలా మేషం నుంచి మీనం వరకు.. 05-03-2023 నుంచి 11-03-2023 ఎవరెవరికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఇప్పుడు చూద్దాం.
Advertisement
మేషం
వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఒత్తిడిని అధిగమిస్తారు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. అదృష్టం కలిసి వస్తుంది. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికారుల ఆదరణ లభిస్తుంది. ఉద్యోగులకు పదోన్నతి అవకాశం. కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు.
Today Horoscope in Telugu 2022
వృషభం
పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. అధికారులతో, బంధువులతో విభేదాలు తలెత్తవచ్చు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. విందులకు హాజరవుతారు. రాబడిని దృష్టిలో ఉంచుకొని ఖర్చు పెట్టడం మంచిది.
మిథునం
మంచి వారితో సంబంధాలు పెంపొందుతాయి. రోజు వారి కార్యకలాపాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. న్యాయవాద వృత్తిలో ఉన్నవారికి పురోగతి ఉంది. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు.
కర్కాటకం
వారం ప్రారంభంలో కొంతమంది ఉన్నప్పటికీ క్రమంగా తొలగిపోతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారికి మంచి అవకాశాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. మంచి వారితో పరిచయాలు ఏర్పడతాయి. పలుకుబడి ద్వారా పనులు నెరవేరుతాయి.
సింహం
వారం మధ్యలో కొన్ని చికాకులు తలెత్తుతాయి. వారాంతానికి సర్దుకుంటాయి. విద్యార్థులకు మంచి సమయం. ఉన్నతమైన ప్రతిభ కనబరుస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు పొందుతారు.
కన్య
Advertisement
అన్నదమ్ములతో సఖ్యత నెలకొంటుంది. ఆస్తి తగాదాలు కొలిక్కి వస్తాయి. వాహనాల ద్వారా పనులు నెరవేరుతాయి. ఖర్చులు తగ్గుతాయి. భూములు నిర్మాణ రంగంలో ఉన్న వారికి పనులు అనుకూలిస్తాయి. ఆర్థిక లావాదేవీల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి.
తుల
పెద్దల సహకారం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి తాత్కాలిక ఊరట దొరుకుతుంది. రాజకీయ వ్యవహారాల్లో చికాకులు ఉంటాయి. పనివారితో అనవసరమైన కళాహాలు ఏర్పడవచ్చు. తీర్థయాత్రలకు వెళ్ళవచ్చు.
వృశ్చికం
శని మినహా మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. అన్ని వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం అవసరం. ఉద్యోగంలో చికాకులో ఉంటాయి. పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. మంచి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. విందులకు హాజరవుతారు.
ధనస్సు
విందులకు హాజరవుతారు. ఉద్యోగులు శుభవార్త వింటారు. ఒత్తిడి ఉన్నప్పటికీ పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. అన్ని రంగాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. రాజకీయ వ్యవహారాలు అనుకూలిస్తాయి. భూ లావాదేవీల్లో గణనీయమైన లాభాలు గడిస్తారు.
మకరం
కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. అన్నదమ్ములతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి. పని భారం పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. ఉత్సాహంగా ఉంటారు.
కుంభం
శుభ కార్యాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. నలుగురికి సహాయం చేస్తారు. విద్యార్థులు కష్టానికి తగిన ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగంలో తాత్కాలిక ప్రయోజనాలు పొందుతారు. ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు.
మీనం
ఎదుటివారిని గుడ్డిగా నమ్మడం వల్ల ఇబ్బందులు రావచ్చు. కొత్త నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం అవసరం. వాహన మరమ్మత్తులు ముందుకు రావచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది.
READ ALSO : పవన్ కళ్యాణ్, మహేష్ బాబు సినిమాల్లో నటించమని అడిగితే ఎందుకు శోభన్ బాబు రిజెక్ట్ చేసాడు ?